ఆకాశ్ దీప్.. నైట్ వాచ్ మెన్..ఇంగ్లాండ్ ను చీల్చిచెండాడాడు..

India vs England 5th Test Day 3: అట్కిన్సన్ ను ఒక ఆట ఆడుకున్నాడు. టంగ్ కు చుక్కలు చూపించాడు.. ఓవర్టన్ ను బెంబేలెత్తించాడు.. వాస్తవానికి అతడు దిగింది నైట్ వాచ్ మన్ గా.. సాధారణంగా నైట్ వాచ్ మన్ లు అంతగా ప్రభావం చూపించరు. ఎప్పుడో ఒకసారి గొప్పగా ఆడుతుంటారు. కాకపోతే విపరీతమైన డిఫెన్స్ ఆడి.. కొంతలో కొంత పరుగులు చేసి వెళ్లిపోతారు. కానీ టీమిండియా ఆటగాడు ఆకాష్ దీప్ అలా కాదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. బౌలింగ్లో అదరగొట్టిన అతడు.. బ్యాటింగ్ లోను సత్తా చూపిస్తున్నాడు.

ఓవల్ టెస్టులో అతడు హాఫ్ సెంచరీ చేశాడు.. ఈ కథనం రాసే సమయం వరకు ఆకాష్ 81 బంతులు ఎదుర్కొని 51* పరుగులు చేశాడు. మూడో వికెట్ కు ఏకంగా 86 పరుగులు జోడించాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ విఫలమైన చోట.. ఆకాష్ దీప్ నిలబడ్డాడు. ఏకంగా తొమ్మిది భౌండరీలు సాధించి.. తన కెరీర్లో తొలి టెస్ట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒక ప్రొఫెషనల్ బ్యాటర్ లాగా బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

Also Read: వరుసగా 5 టెస్టులు. లాంగ్ స్పెల్స్.. సిరాజ్.. మన డీఎస్పీ సాబ్ అలుపెరగని పోరాటం

మూడోరోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ఆకాష్ దీప్ కు జీవధానం లభించింది. స్లిప్ లో ఆకాష్ ఇచ్చిన క్యాచ్ ను క్రాలీ నేలపాలు చేశాడు. అంతకుముందు ఎల్బిడబ్ల్యు నుంచి కాస్తలో కాస్త తప్పించుకున్నాడు. ఇలా ఆకాష్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని గట్టిగా నిలబడ్డాడు. తద్వారా తను జట్టులో ఎంత ప్రత్యేకమో నిరూపించుకున్నాడు. ఆకాష్ తెగువ నేపథ్యంలో టీమిండియా ఐదో టెస్టుపై పట్టు బిగించింది. ఈ కథనం రాసే సమయం వరకు 136 పరుగుల లీడ్ లో కొనసాగుతోంది.. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 224 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టు 247 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టుకు 23 పరుగుల లీడ్ లభించింది.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన టీమిండియా ఇప్పటివరకు రెండు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కాగా, ఇండియా తరఫున నైట్ వాచ్మెన్ గా వచ్చి.. హైయెస్ట్ స్కోర్ చేసిన ఆటగాడిగా అమిత్ మిశ్రా కొనసాగుతున్నాడు. 2011లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్టులో అతడు 84 పరుగులు చేశాడు.


[

Leave a Comment