YCP unable to tolerate TCS Land: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నేతల ఆలోచనలు దారుణంగా ఉన్నాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత వారు తట్టుకోలేకపోతున్నారు. వైసీపీ హయాంలో సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అమలు చేశారు. అదే సమయంలో అభివృద్ధిని గాలికి వదిలేసారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మిగిల్చారు. అంతటితో ఆగకుండా వ్యవస్థలను ధ్వంసం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఒక్కొక్కటి గాడిలో పడుతోంది. దీనిని ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. ప్రభుత్వ చర్యలను ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే అమ్మ పెట్టను పెట్టదు.. తిననివ్వదు అన్నట్టు.. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అడ్డు తగులుతోంది. ముఖ్యంగా విశాఖను ఐటి హబ్ గా మార్చాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఏకంగా హైకోర్టు న్యాయమూర్తి ఈ విషయంలో అక్షింతలు వేసే దాకా పరిస్థితి వచ్చింది. విశాఖలో భూముల కేటాయింపు పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దానిని పక్కన పడేసారు న్యాయమూర్తి. ఈ సందర్భంగా వ్యాఖ్యలు కూడా చేశారు.
Read Also: స్పిరిట్ మూవీకి సందీప్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..?
ఐటి హబ్ గా మార్చాలని లక్ష్యం.. విశాఖను( Visakhapatnam) ఐటీ హబ్ గా మార్చాలన్నది కూటమి ప్రభుత్వ ప్రణాళిక. అందులో భాగంగా ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలు విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థలకు భూ కేటాయింపులతో పాటు పెద్ద ఎత్తున రాయితీలు అందించింది. అయితే ఏదైనా సంస్థ పెట్టుబడులు పెడితే ప్రభుత్వాలు భూములతో పాటు రాయితీలు అందించడం సర్వసాధారణం. అయితే దానిని తప్పుపడుతూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అంటే పరిశ్రమల స్థాపన, ఇతరత్రా సానుకూలతలు ప్రభుత్వానికి రాకూడదు అన్నదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయంగా తెలుస్తోంది.
99 పైసలకే ఎకరా..
ప్రపంచ దిగ్గజ ఐటి సంస్థ టిసిఎస్ కు( Tata Consultancy Service) విశాఖలోని మధురవాడలో 21 ఎకరాల భూమిని కేటాయించింది కూటమి ప్రభుత్వం. ఎక్కడ భూమిని కేవలం 99 పైసలకు చొప్పున కేటాయించింది. టిసిఎస్ కంపెనీ భూములను వినియోగించుకుని వచ్చే రెండేళ్లలో పెట్టుబడులు పెడితే 5000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మరో పదివేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తద్వారా అంతర్జాతీయ స్థాయికి విశాఖ చేరుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్ర కోణాన్ని బయటపెట్టింది. ఆ పార్టీకి చెందిన వ్యక్తిగా భావిస్తున్న ఓ నేత ఏకంగా హైకోర్టులో పిటిషన్ వేశారు. భూ కేటాయింపులను నిలిపివేయాలని కోరగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అదే అంశాన్ని బయటపెట్టారు మంత్రి నారా లోకేష్.
Read Also: రేపే అన్నదాత సుఖీభవ.. ఈరోజు సాయంత్రం వరకు వారికి ఛాన్స్!
న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు..
నిన్ననే హైకోర్టులో( High Court) ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఏపీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందని.. ఇంతలోనే అడ్డుకునే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారని.. న్యాయమూర్తి ప్రశ్నించినట్లు సమాచారం. మీకు అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? పెట్టుబడులు వస్తుంటే తట్టుకోలేకపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఇది సరికాదు. ఏపీ ప్రభుత్వానికి స్వేచ్ఛనివ్వండి. కొన్నాళ్లపాటు వేచి చూడండి. ఆ తరువాత ఏం జరుగుతుందో చూద్దాం.. అంతేకానీ ఎప్పటికీ ఇప్పుడు అడ్డుపడిపోయి.. ఏదో జరిగిపోతుందని ఊహల్లో తేలి కోర్టు సమయాన్ని వృధా చేయడం సరికాదు.. అంటూ న్యాయమూర్తి హెచ్చరించినట్లు తెలుస్తోంది. నారా లోకేష్ సైతం ఇదే విషయాన్ని తాజాగా వెల్లడించారు.