Site icon Desha Disha

T20 Ranking: నెంబర్ వన్ గా అభిషేక్ శర్మ

T20 Ranking: నెంబర్ వన్ గా అభిషేక్ శర్మ

– Advertisement –

నవతెలంగాణ – హైదరాబాద్: బరిలో దిగితే మొదటి బంతి నుంచే బాదుడు… మ్యాచ్ ఏ దశలో ఉన్నా బౌలర్ కు చుక్కలు చూపించడమే లక్ష్యంగా ఆడే ఆటగాడు… కూల్ గా కనిపిస్తూనే, కుమ్మేసే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్… ఈ లక్షణాలన్నీ కలబోస్తే టీమిండియా యువకిశోరం అభిషేక్ శర్మ అవుతాడు. ఈ పంజాబ్ బ్యాటర్ మెరుపులు ఐపీఎల్ లో అందరికీ పరిచితమే. టీమిండియా తరఫున ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్లోనూ మనోడు దుమ్మురేపాడు. 

తాజాగా, ఐసీసీ విడుదల చేసిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో అభిషేక్ శర్మ నెంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. విశేషం ఏంటంటే… సన్ రైజర్స్ టీమ్ లో తన ఓపెనింగ్ పార్టనర్ ట్రావిస్ హెడ్ ను వెనక్కి నెట్టి టాప్ ర్యాంక్ లో నిలిచాడు. ప్రస్తుతం ట్రావిస్ హెడ్ ఖాతాలో 814 రేటింగ్ పాయింట్లు ఉండగా… అభిషేక్ 829 పాయింట్లతో అగ్రస్థానం అందుకున్నాడు. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ టీ20 సిరీస్ కు హెడ్ దూరంగా ఉండడం అతడి ర్యాంకింగ్ పై ప్రభావం చూపింది.  అభిషేక్ శర్మ కెరీర్ లో ఇప్పటివరకు 17 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడి 535 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు ఉండడం అభిషేక్ దూకుడుకు నిదర్శనం. అతడి స్ట్రయిక్ రేట్ (193.84) దాదాపు 200కి చేరువలో ఉండడం విశేషం.

– Advertisement –

Exit mobile version