Russia Japan Tsunami Latest News: రిక్టర్ స్కేల్ పై 8 తీవ్రతతో ప్రపంచాన్ని షేక్ చేసిన భూకంపాలు ఎన్ని?

Russia Japan Tsunami Latest News: రష్యాలో భారీ భూకంపం ఏర్పడింది. కామ్చట్కా ద్వీపకల్పంలో రిక్టర్ స్కేల్ 8.8 తీవ్రతతో ఇక్కడ రావడంతో జపాన్ దేశం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచంలో ఇప్పటి వరకు 2011లో ఏర్పడిన ఈ తీవ్రత ఇప్పుడు మళ్లీ ఆ స్థాయిలో వచ్చిందని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రిక్టర్ స్కేల్ పై 8 తీవ్రతతో ఏర్పడిన భూకంపాలు ఎన్ని? అవి ఏ దేశంలో సంభవించాయి?

ప్రస్తుతం రష్యాలోని కమ్చట్కా ప్రాంతంలో ఏర్పడిన భూకంపం 1952లోనూ ఏర్పడింది. ఆ సమయంలో రిక్టర్ స్కేల్ పై 9.0 తీవ్రత నమోదైంది. ఆ సమయంలో సునామీ రావడంతో తీవ్ర నష్టం జరిగింది. రష్యా తరువాత అత్యంత తీవ్రత కలిగిన భూకంపం చిలీ దేశంలో ఏర్పడింది. ఈదేశంలో అతిపెద్ద భూకంపం సంభవించింది. 1960వ సంవత్సరంలో ఇక్కడ రిక్టర్ స్కేల్ పై 9.5 తీవ్రత నమోదైందని చెబుతున్నారు. ఆ సమయంలో 1,655 మంది మరణించినట్లు సమాచారం. ఇదే దేశంలో 2010లోనూ మరోసారి సంభవించింది. ఆసమయంలో రిక్టర్ స్కేల్ పై 8.8 తీవ్రత నమోదైంది. ఈ సమయంలో 523 మంది మరణించారు.

Also Read: భారీ భూకంపం.. సముద్రంలో భీకర సునామీ.. భయానక దృశ్యాలు

ఇండోనేషియానూ భూకంప బాధిత దేశంగా పిలుస్తారు. ఈ దేశంలో 2004లో సమత్రా దీవుల్లో భూకంపం ఏర్పడింది. ఇక్కడ రిక్టర్ స్కేల్ పై 9.1గా నమోదైంది. దీంతో ఇక్కడ 2.8 లక్షల ప్రాణ నష్టం జరిగింది. ఈ దేశంలో మరోసారి 2012లో జరిగిన భూకంపం అతి తీవ్రమైనదిగా చెబుతారు. కానీ ఈ సమయంలో ఎలాంటి నష్టం జరగలేదు.ఈ విషయంలో అమెరికా కూడా బాధిత దేశమే. 1964వ సంవత్సరంలో అలస్కాలో ఏర్పడిన భూకంపం తీవ్రమైనదిగా పరిగణిస్తారు. ఈ సమయంలో రిక్టర్ స్కేల్ పై 9.2 గా నమోదైంది. దీంతో 130 మంది చనిపోయారు. యునైటైడ్ స్టేట్స్ లోని అలస్కా రాట్ దీవుల్లో 8.7 తీవ్రతతో భూకంపం ఏర్పడింది. 1965లో ఇక్కడ భూకంపం ఏర్పడడంతో సముద్రం ఉప్పోంగింది.

భారతదేశంలోనూ రిక్టర్ స్కేల్ పై 8 తీవ్రత నమోదైన ఘటనలు ఉన్నాయి. 1950 సంవత్సరంలో ఇక్కడ 8.6 తీవ్రతతో సంభవించింది. దీంతో ఈ సమయంలో 780 మంది ప్రాణాలు కోల్పోయారు. జపాన్ విషయానికొస్తే ఈ దేశంలో 2011లో భారీ భూకంపం సంభవించిది. ఆ ఏడాది రిక్టర్ స్కేల్ పై 9.1 నమోదవగా 15 వేలపైగా మరణించారు.

ఇలా ఇప్పటి వరకు రిక్టర్ స్కేల్ పై 8 తీవ్రత కంటే ఎక్కువగా నమోదైన సంఘటనలు ఉన్నాయి. అయితే రిక్టర్ స్కేల్ పై 7 నమోదైనా.. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. 2024 ఏడాదిలో జపాన్ లో 7.5 తీవ్రతతో భూకంపం ఏర్పడింది.

Leave a Comment