Russia Earthquake : ఆపరేషన్ చేస్తుండగా 8.8 తీవ్రతతో భూకంపం.. డాక్టర్లు ఏం చేశారంటే.. వైరల్ వీడియో

Russia Earthquake : రష్యాలో అద్భుతమైన క్షణం.. భూకంపం ధాటికి భయపడకుండా ఓ ప్రాణాన్ని కాపాడిన డాక్టర్ల ధైర్యం ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. 8.8 తీవ్రతతో రష్యాలో భూకంపం సంభవించిన వేళ ఓ ఆసుపత్రిలో ఆపరేషన్ మధ్యలో ఉండగా భూమి కంపించడంతో ఒకసారిగా అంతా కలకలం అయ్యింది.

వైద్యులు, సర్జన్లు భయపడకుండా.. శస్త్రచికిత్సను ఆపకుండా, పూర్తిగా రోగి ప్రాణాలు కాపాడడంపైనా దృష్టి పెట్టారు. ఆ సమయంలో ఆపరేషన్ థియేటర్ లో లైట్లు వణికిపోయినా, ఫర్నిచర్ కదిలిపోతున్నా.. మాస్క్ వేసుకున్న డాక్టర్లు తన పనిని నిశ్చలంగా కొనసాగించారు. ఇది ఓ CCTV ఫుటేజీలో రికార్డయ్యి, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: భారీ భూకంపం.. సముద్రంలో భీకర సునామీ.. భయానక దృశ్యాలు

ఈ వీడియోపై ప్రపంచవ్యాప్తంగా ప్రజలు స్పందిస్తూ, “ఇది నిజమైన సేవాభావం.. వీరే రియల్ హీరోలు” అంటూ మెచ్చుకుంటున్నారు.

ఒకవైపు ప్రకృతి ప్రకోపం.. మరోవైపు మనిషి సేవా నిబద్ధత. రెండింటి మధ్య జరిగిన ఈ సంఘటన ఎంతో మందికి ప్రేరణగా మారుతోంది.

Leave a Comment