Site icon Desha Disha

Rakhi Festival: ఈ తేదీల్లో పుట్టినవారికి రాఖీ పండగ శుభాలను తెస్తుంది.. ఉద్యోగం, అవార్డులు, రివార్డులు వీరి సొంతం – Telugu News | Rakshi Festival 2025: These are Lucky Radix Number May get good luck

Rakhi Festival: ఈ తేదీల్లో పుట్టినవారికి రాఖీ పండగ శుభాలను తెస్తుంది.. ఉద్యోగం, అవార్డులు, రివార్డులు వీరి సొంతం – Telugu News | Rakshi Festival 2025: These are Lucky Radix Number May get good luck

ఈ సంవత్సరం రాఖీ పండుగను ఆగస్టు 9, 2025, శనివారం జరుపుకోనున్నారు. ఈసారి రాఖీ పండగ కొన్ని ప్రత్యేక రాడిక్స్ ఉన్నవారికి చాలా శుభ సంకేతాలను తెస్తుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ పండుగ 1, 3, 5, 6 లేదా 9 జన్మ రాడిక్స్ ఉన్న వ్యక్తుల జీవితాల్లో కొత్త అవకాశాలను, సానుకూల మార్పులను తెస్తుంది. ఈ రాడిక్స్ ఉన్నవారికి రాఖీ పండుగ ఎంత శుభప్రదంగా ఉండబోతుందో తెలుసుకుందాం…

రాడిక్స్ 1:
1, 10, 19 లేదా 28 తేదీలలో జన్మించిన వ్యక్తుల మూల సంఖ్య 1. ఈ ఏడాది రాఖీ పండగ రోజున ఈ మూల సంఖ్య ఉన్నవారు లేదా ఈ తేదీల్లో పుట్టిన వారు తమ కెరీర్‌లో ఒక గొప్ప అవకాశాన్ని పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రోజు నీలం రంగు దుస్తులు ధరిస్తే వీరికి అదృష్టాన్ని తెస్తుంది.

రాడిక్స్ 3:
ఎవరైనా 3, 12, 21 లేదా 30 తేదీలలో జన్మించినట్లయితే.. వీరి రాడిక్స్ 3. రాఖీ పండగ వీరికి మంచి శుభవార్తని తీసుకొస్తుంది. వీరికి ఆస్తి, వాహనానికి సంబంధించిన శుభవార్తలను వినే అవకాశం ఉంది. ఈ రోజున కొత్త కారు కొనాలనే ఆలోచన విజయవంతమవుతుంది. ఎరుపు రంగు వీరికి శుభప్రదంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రాడిక్స్ 5:
5, 14 లేదా 23 తేదీలలో జన్మించిన వారికి మూల సంఖ్య 5. రాఖీ పండగ రోజున ఆఫీసులో గొప్ప విజయాన్ని సాధించే అవకాశం ఉంది. సాధన చేస్తే ఫలితం పొందే అవకాశం ఉంది. సోదరుడు , సోదరి మధ్య సంబంధంలో మరింత మాధుర్యం ఉంటుంది. ఈ రోజున గోధుమ రంగును ఉపయోగించడం వీరికి ప్రయోజనకరంగా ఉంటుంది. వీరి తమ విలువైన వస్తువులపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిది.

రాడిక్స్ 6: 6, 15 లేదా 24 తేదీలలో జన్మించిన వారు రాడిక్స్ 6 కిందకు వస్తారు. ఈ వ్యక్తులకు రాఖీ పండగ రోజు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ లేదా ఆస్తిలో చేసే పెట్టుబడి మంచి రాబడిని ఇస్తుంది. వ్యాపారవేత్తలు మంచి భాగస్వామ్య అవకాశాన్ని పొందే అవకాశం ఉంది.

రాడిక్స్ 9: 9, 18 లేదా 27 తేదీలలో జన్మించిన వారికి మూల సంఖ్య 9 ఉంటుంది. ఈ రాఖీ పండగ రోజున ఈ తేదీల్లో జన్మించిన వారు అవార్డుని పొందవచ్చు లేదా ప్రశంసలు లభించవచ్చు. భవిష్యత్తులో సహాయకారిగా నిరూపించగల ప్రభావవంతమైన వ్యక్తిని కలిసే సూచనలు కూడా ఉన్నాయి. ఈ రోజున పీచు రంగు వీరికి అదృష్టాన్ని తెస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Exit mobile version