Peddi Reddy Caste Strategy: పెద్ది’రెడ్డి’ ప్లాన్ వర్కౌట్ కాలే!

Peddi Reddy Caste Strategy: ఏపీలో( Andhra Pradesh) కుల రాజకీయాలు అధికం. ఫలానా కులం ఫలానా పార్టీకి అనుకూలం అని చెప్పడమే కాదు.. తాము అభిమానించే రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటారు. అవసరం అనుకుంటే తామే రంగంలోకి దిగుతారు. ప్రపంచం నలుమూలల నుంచి తమ కులం కోసం ఏపీకి వస్తుంటారు. అంతలా మారింది ఏపీలో కుల రాజకీయం. 2024 ఎన్నికల్లో టిడిపి కోసం రంగంలోకి దిగింది కమ్మ సామాజిక వర్గం. అంతకుముందు ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం రంగంలోకి దిగింది రెడ్డి సామాజిక వర్గం. 2024 ఎన్నికల్లో జనసేన కోసం రంగంలోకి దిగింది కాపు సామాజిక వర్గం. ఇలా ప్రధాన సామాజిక వర్గాలు పార్టీల వారీగా విడిపోయాయి. అయితే రెడ్డి సామాజిక వర్గం విషయంలో మాత్రం చాలా మార్పు కనిపించింది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఆ సామాజిక వర్గం ఆలోచన మారింది.

Also Read: చంద్రబాబును టార్గెట్ చేసిన జగన్ బాధితులు!

పట్టించుకోలేదన్న విమర్శ..
2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress )పార్టీ అధికారంలోకి రావాలని రెడ్డి సామాజిక వర్గం బలంగా కోరుకుంది. ఎంతలా అంటే ఆ సామాజిక వర్గం అహోరాత్రులు శ్రమించింది. ప్రత్యర్థి పార్టీలో రెడ్డి సామాజిక వర్గం సైలెంట్ అయ్యేలా చేసింది. ఆర్థికంగా కూడా వెన్నుదన్నుగా నిలిచింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తమను ఏమీ చేయలేదన్న భావన ఆ సామాజిక వర్గంలో ఏర్పడింది. ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనాలు లేకుండా పోయాయన్న ఆవేదన వారిలో ఉండిపోయింది. అదే 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీసింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం విషయంలో ఒక రకమైన మార్పు కనిపిస్తోంది. వివిధ రంగాల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం వారి జోలికి వెళ్లకుండా.. వారి ఆర్థిక ప్రయోజనాలకు భంగం కలిగించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో వైసీపీ దగ్గర ఉన్న ఆ కొద్ది రెడ్డి సామాజిక వర్గం కూడా ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది.

ఆ నలుగురికే లబ్ది
ఐదేళ్లపాటు ఆ నలుగురు మాత్రమే లబ్ధి పొందారు అన్న విమర్శ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. మిగతా సామాజిక వర్గం వారి విషయంలో అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా వారికి ఎటువంటి ఆర్థిక చేయూతలేదు. మరోవైపు మద్యం కుంభకోణం కేసు చూస్తుంటే ఆ స్థాయిలో లబ్ది పొందారా.. ఆ నలుగురు సైతం జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. అయితే ఇప్పుడు ఆ నలుగురి కోసం రెడ్డి సామాజిక వర్గాన్ని కూడదీసే ప్రయత్నం చేశారు సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రెడ్డి సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని.. సంఘటితం చేసే ప్రయత్నం చేశారు. కానీ రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం మాత్రం దక్కడం లేదు. ఆ స్థాయిలో మీరు ఆదాయం పొందితే.. మేం పోరాటం చేయాలా? మాకు ఒక్క రాజకీయ ప్రయోజనం అయినా చేకూర్చారా? అంటూ వారంతా నిలదీస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read:  విజయసాయిరెడ్డిని వీడని ‘భీమిలి’ నిర్మాణాలు!

కమ్మ సామాజిక వర్గంలో ఐక్యత..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో చాలామంది రెడ్డి సామాజిక వర్గం( ready community నేతలకు సరైన ప్రాధాన్యం దక్కలేదు. ఆపై వివిధ రంగాల్లో ఉన్న వారికి సైతం ప్రభుత్వం నుంచి మొండి చేయి తగిలింది. మద్యం వ్యాపారం చేసుకుందామంటే ప్రభుత్వ పాలసీని మార్చేశారు. ప్రభుత్వమే నేరుగా నడుపుకునేలా చేశారు. అందులో కూడా ఆ నలుగురే లబ్ధి పొందారు. ఇసుక, మైనింగ్ గురించి చెప్పనవసరం లేదు. అందులో కూడా ఒకరిద్దరు మాత్రమే లబ్ది పొందారు. పోనీ ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టు దక్కించుకుంటే బిల్లులు చేయలేదు. ఇలా అన్నింట తమకు అన్యాయం జరిగిందన్న ఆవేదన రెడ్డి సామాజిక వర్గంలో ఉంది. అందుకే ఇప్పుడు వారు ముందుకు రావడం లేదు. అయితే రెడ్డి సామాజిక వర్గంతో పోల్చితే కమ్మ సామాజిక వర్గంలో ఐక్యత కనిపిస్తోంది.

Leave a Comment