Site icon Desha Disha

Operation Sindoor Discussion: ఆపరేషన్ సింధూర్ పై చర్చ : కాంగ్రెస్ ఫెయిలా? పాస్ నా?

Operation Sindoor Discussion: ఆపరేషన్ సింధూర్ పై చర్చ : కాంగ్రెస్ ఫెయిలా? పాస్ నా?

Operation Sindoor Discussion: పహేల్గాం లో ఉగ్రవాదుల దాడి అనంతరం భారత్ సైన్యం పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించాయి. ఆపరేషన్ సింధూర్ అని పేరుతో నిర్వహించిన ఈ దాడులతో పాకిస్తాన్ దాదాపు కాళ్ళ బేరానికి వచ్చింది. అయితే ఈ విషయంలో మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి ఈ ఆపరేషన్ ఈ విధంగా నిర్వహించారు. పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాద శిబిరాలను దాడి చేసే సందర్బంగా పాకిస్తాన్ ఈ విధంగా స్పందించింది, అందుకు భారత్ ఎలా వాటిని తిప్పికొట్టిందనే విషయాలపై సుదీర్ఘంగా వివరించారు. అయితే కానీ ఈ విషయంలో లోక్ సభలో లోతుగా చర్చించాలని కాంగ్రెస్ పట్టుబట్టడం చర్చకు దారితీసింది. ఈ విషయంలో కాంగ్రెస్ ఆ ఆపరేషన్ కు సంబంధించి వివరాలను అడగడం లో తప్పేమీ లేదు. కానీ బహిరంగంగా ఈ విషయంపై చర్చించాలని పట్టుపట్టడం బీజేపీని ఇరుకున పెట్టాలని చేస్తున్న ప్రయత్నంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఆ ప్రశ్నకు సమాధానం ఏది?.. మోడీ విపక్షాలకు దొరికిపోయారా?

ఈ ఆపరేషన్ లో భారత్ పై కూడా పాకిస్తాన్ ఎదురుదాడి చేసి జెట్ ఫైటర్స్ ను కూల్చివేసినట్లు ప్రచారం చేసుకోవడం సర్వసాధారణమే. అయితే ఎన్ని జెట్ ఫైటర్స్ మనం కోల్పోవాల్సి వచ్చింది, ఈ విషయంలో ట్రంప్ ఎందుకు జోక్యం కల్పించుకోవాల్సి వచ్చింది. ఆపరేషన్ ను ఆపేయాలని ట్రంప్ అన్న వెంటనే ఎందుకు ఆపాల్సివచ్చిందనే విషయాలపై వివరాలు తెలియచేయాలని కాంగ్రెస్ సభలో కోరింది.
ఈ ఆపరేషన్ తో చావుదెబ్బ తిన్న పాకిస్తాన్ ఇంకా ఒకటి, రెండు రోజులు యుద్ధం ఇలాగే కొనసాగితే తాము నామరూపాలు లేకుండా పోతామని గ్రహించి అమెరికా శరణు వేడినట్లు తెలుస్తోంది. దీంతో స్పందించిన ట్రంప్ ఇక ఆపరేషన్ ఆపివేయాలని ప్రధానిని కోరడం ఆ సమయంలోనే యుద్ధ విరమణ ప్రకటించడంతో ట్రంప్ కోరిక మేరకే యద్ధం ఆపారనే ప్రచారం జరిగింది. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని, భారత్ పై ట్రంప్ ఆధిపత్యం ఏంటనే ప్రశ్న కూడా ఉత్పన్నమయ్యింది. ట్రంప్ చేయమంటే యద్ధం చేయడం, ఆపమంటే ఆపివేయడంలో ఆంతర్యం ఏమిటని కూడా చర్చ జరిగింది. చేయాలనుకున్న ఆపరేషన్ పూర్తిగా చేయకుండానే యుద్ధ విరమణ చేయడంపై కూడా అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

ఇన్ కెమెరా లో చర్చిస్తే సరిపోతుంది.
దేశ భద్రతకు సంబంధించిన ఇలాంటి విషయాలపై
లోక్ సభలో
బహిరంగంగా కాకుండా అంతర్గత సమావేశం నిర్వహించి, ఇన్ కెమెరా లో చర్చిస్తే తప్పేమీ లేదు. యద్ధం వల్ల శత్రు దేశాన్ని ఏవిధంగా దెబ్బకొట్టారో వివరాలతో పాటు, మనం కూడా ఎంతవరకు నష్టపోయామో కూడా ప్రధాన విపక్ష నేతలకు తెలియచెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది అనే వాదన కూడా వినిపిస్తోంది.

Also Read: ఆపరేషన్ సింధూర్.. ఇన్నాళ్లకు సంచలన నిజం చెప్పిన మోడీ

ట్రంప్ ఎందుకు జోక్యం చేసుకున్నట్లు?
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ దృష్టి ప్రస్తుతం నోబెల్ శాంతి బహుమతిపై పడిందనే ప్రచారం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది. గతంలో అమెరికా అధ్యక్షులు పెద్దన్న పాత్ర పోషించి ఎలాగైతే నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నరో అదే విధానం తాను అనుసరించి ప్రపంచ చరిత్రలో శాంతిదూతగా నిలిపోవాలని ట్రంప్ కు కొత్త ఆలోచన వచ్చిందని, అందులో భాగంగానే ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా తాను మధ్యవర్తిగా వ్యవహరించి, యుద్ధాన్ని ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడని ఒక వాదన వినిపిస్తోంది. ఆ ప్రక్రియలో భాగంగానే భారత్ – పాకిస్తాన్ ల మధ్య యద్ధం ఆపివేయాలని తలంపుతో ఆపరేషన్ సింధూర్ విషయంలో ట్రంప్ జోక్యం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో ఏ దేశాల మధ్య ఎక్కడ యుద్ధం జరిగినా ట్రంప్ ఆ యద్ధం ఆపడానికి ప్రయత్నం చేయడం, అందుకు అనుగుణంగా గ్లోబల్ గా ప్రచారం కూడా చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ప్రపంచంలో ఎక్కడ యద్ధం జరిగినా ప్రోత్సహిస్తూ వారికి యుద్ధ సామాగ్రి చేరవేసి, దేశాల మధ్య యుద్ధకాంక్షను సొమ్ము చేసుకొన్న అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు శాంతి వచనాలు పలికేందుకు కారణం అదే అని అంటున్నారు. రెండు దేశాల మధ్య యుద్ధం జరగాలి, ఆ యుద్ధం తన ప్రమేయంతో విరమణ అయిందనే ప్రచారం చేసుకోవడం ట్రంప్ పనిగా పెట్టుకున్నారని కొంత మంది విశ్లేషిస్తున్నారు.
ఏదీ ఏమైనా ఆపరేషన్ సింధూర్ ద్వారా ట్రంప్ లబ్దిపొందారనే వాదన వినిపిస్తోంది.

Exit mobile version