Nara Lokesh On Singapore Tour: చంద్రబాబు సింగపూర్ టూర్ పై పెద్దిరెడ్డి ‘పెద్ద’ కుట్ర!?*

Nara Lokesh On Singapore Tour: సింగపూర్( Singapore) ప్రభుత్వ ప్రతినిధులతో పాటు పారిశ్రామికవేత్తలకు వైసీపీ నుంచి ఈమెయిల్స్ వెళ్లాయా? ఏపీలో అస్థిర ప్రభుత్వం ఉందని ఫిర్యాదులు చేశారా? పెట్టుబడులు పెట్టొద్దని సూచించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆరు రోజుల పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు బృందం సింగపూర్ వెళ్ళింది. ఆ బృందంలో మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ ఉన్నారు. ఉన్నతాధికారుల సైతం ఈ బృందంలో ఉన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అక్కడి పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు కోరారు. అమరావతి రాజధాని లో భాగస్వామ్యం విషయంలో సింగపూర్ సహకారాన్ని కోరారు. గత ఐదేళ్లలో ఒప్పందాలు రద్దు చేసుకున్న పరిస్థితిని వివరించి.. మరోసారి అటువంటి పరిస్థితి రాకుండా చూసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. అయితే సింగపూర్ పర్యటన విజయవంతం కాకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెగ ప్రయత్నాలు చేసిందన్న ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. నారా లోకేష్ ప్రకటనతో ఇది స్పష్టమవుతోంది.

* బిజీ బిజీగా చంద్రబాబు బృందం..
గత ఆరు రోజులుగా సింగపూర్లో బిజీగా గడిపింది సీఎం చంద్రబాబు( CM Chandrababu) బృందం. కీలక వ్యక్తులను, ప్రతినిధులను కలిసి.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించింది. అయితే సింగపూర్ పర్యటనలో చంద్రబాబు బృందానికి షాకింగ్ పరిణామం ఎదురైనట్లు తెలుస్తోంది. అక్కడి ప్రభుత్వ ప్రజాప్రతినిధులతో పాటు దిగ్గజ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులకు పెద్ద ఎత్తున ఏపీ నుంచి మెయిల్స్ వెళ్లినట్లు సమాచారం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన అనుకూల వాతావరణం లేదని.. రాజకీయ అస్థిరత కొనసాగుతోందని.. కొద్ది రోజుల్లో ప్రభుత్వం మారిపోతుందని ఆ మెయిల్స్ లో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీని వెనుక కచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందని కూటమి ప్రభుత్వం అనుమానిస్తోంది. గతంలో ఇటువంటి పరిణామాలే చాలా వరకు చోటు చేసుకున్నాయి.

Also Read: నారా లోకేష్ ఓ గొప్ప మాట చెప్పాడు..

* మురళీకృష్ణ అనే వ్యక్తితో..
అయితే తాజాగా మంత్రి లోకేష్ ( Minister Lokesh) కీలక ప్రకటన చేశారు. సింగపూర్ ప్రతినిధులకు ఈమెయిల్ పంపింది మురళీకృష్ణ అనే వ్యక్తి అని ప్రకటించారు. సదరు మురళీకృష్ణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ ప్రతినిధులతో తరచూ మాట్లాడేవారని.. అదే సమయంలో కొందరు వైసీపీ నేతలకు సైతం టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. ఆయనే సింగపూర్ ప్రతినిధులతో పాటు పారిశ్రామికవేత్తలకు, సంస్థలకు పెద్ద ఎత్తున ఈమెయిల్స్ పంపినట్లు సమాచారం. పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండుసార్లు పునరాలోచించుకోవాలని.. అమరావతి రాజధాని విషయంలో ఒక సైతం భాగస్వామ్యం కావద్దని ఆ మెయిల్స్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

* గతంలో కూడా ఫిర్యాదులు..
గతంలో కూడా వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నుంచి ఇటువంటి మెయిల్స్ వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. దానిపై ఫిర్యాదులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అమరావతి రాజధానికి ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే అమరావతి ఆమోదయోగ్యం కాదని.. అది ముంపు ప్రాంతం అంటూ ఏకంగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు ఫిర్యాదు చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో ఆర్థిక సాయం చేయవద్దని కూడా సూచించింది. దీనిపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఏపీకి వచ్చి ఆరా తీశారు కూడా. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే మాత్రం రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలిగించినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా అయితే ఆ పార్టీ పరిస్థితి దిగజారడం ఖాయమని తేల్చి చెబుతున్నారు.

Leave a Comment