
దిశ, వెబ్ డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. అయితే దేశవ్యాప్తంగా సిలిండర్ ధరలను చమురు కంపెనీలు నేడు సవరించాయి. హోటళ్లు, రెస్టారెంట్లు తదితర అవసరాల కోసం వాడే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.33.50 తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. నేటి(ఆగస్టు 1) నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయి. తగ్గించిన ధరతో దిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1631.50గా ఉండనుంది. ఇక ఇళ్లలో వాడే 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు జరగలేదు. దీంతో గృహ వినియోగదారులకు నిరాశే మిగిలింది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదారాబాద్: రూ. 905
వరంగల్: రూ.924
విశాఖపట్నం: రూ. 861
విజయవాడ: రూ.875
గుంటూరు: రూ. 877