Defense Expo Turkey: టర్కీ చేతిలో సరికొత్త ఆయుధం.. ఉలిక్కిపడిన ప్రపంచ దేశాలు!

Defense Expo Turkey: టర్కీ.. ఈ పేరు మూడేళ్లుగా తరచూ వార్తల్లో వినిపస్తోంది. మూడేళ్ల క్రితం ఈ దేశంలో భారీ భూకంపం సంభవించింది. వేల మంది మరణించారు. ఈ విషయం తెలుసుకున్న భారత్‌ తనవంతుగా సాయం అందించింది. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతోపాటు ఆహారం, నీళ్లు, పాలు పంపించింది. ఆర్థికసాయం కూడా చేసింది. భారత్‌ నుంచి అపరిమిత సాయం పొందిన టర్కీ.. ఇటీవల భారత్‌ చేపట్టి ఆపరేషన్‌ సిందూర్‌కు వ్యతిరేకంగా పనిచేసింది. పాకిస్తాన్‌కు మద్దతు తెలిపింది. డ్రోన్లు కూడా అందించింది. తర్వాత భారత్‌ కూడా టర్కీపై యాక్షన్‌ మొదలు పెట్టింది. ఇలాంటి టర్కీ ఇప్పుడు ప్రపంచ దేశాలు వణికిపోయే వార్త చెప్పింది. తన 17వ అంతర్జాతీయ రక్షణ పరిశ్రమ ప్రదర్శనలో, జులై 29న రెండు అత్యాధునిక నాన్‌న్యూక్లియర్‌ బాంబులను ఆవిష్కరించింది. 970 కిలోగ్రాముల బరువున్న గాజాప్‌ (రాత్‌), హయాలెట్‌ (ఘోస్ట్‌) బాంబులు టర్కీ రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికత యొక్క గణనీయ పురోగతిని సూచిస్తున్నాయి. ఈ బాంబులు టర్కీ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ద్వారా అభివృద్ధి చేయబడ్డాయి, ఇవి ఆధునిక యుద్ధ సామర్థ్యాలను పెంచే దిశగా ఒక ముందడుగుగా నిలుస్తున్నాయి.

Also Read: భారత్‌ వ్యూహాత్మక దౌత్యం.. యూకే ట్రేడ్‌ డీల్‌.. అమెరికాకు షాక్‌!

అణు బాంబుకన్నా ఎక్కువ..
గాజాప్‌ బాంబు, 970 కిలోల బరువుతో, థర్మోబారిక్‌ లక్షణాలతో రూపొందించబడింది, ఇది ఒక కిలోమీటరు వ్యాసంలో 10,000 ఫ్రాగ్మెంట్‌లను విసరగలదు. ఇది సంప్రదాయ ఎంకేసిరీస్‌ బాంబుల కంటే మూడు రెట్లు ఎక్కువ విధ్వంస శక్తిని కలిగి ఉంది. ఈ బాంబు ఎఫ్‌16, ఎఫ్‌4 ఫైటర్‌ జెట్‌ల నుంచి ప్రయోగించబడుతుంది, భవిష్యత్తులో డ్రోన్‌ల ద్వారా కూడా ఉపయోగించే సామర్థ్యం ఉంది. దీని విస్ఫోటనం 3 వేల డిగ్రీల సెల్సియస్‌ వేడిని ఉత్పత్తి చేస్తుంది, ఇది ఉక్కు, కాంక్రీటును కరిగించగల సామర్థ్యం కలిగి ఉంది, శత్రు బలగాలు, మౌలిక సౌకర్యాలపై గణనీయ ప్రభావాన్ని చూపుతుంది.

బంకర్‌ బస్టర్‌ శక్తి..
హయాలెట్‌ (ఎన్‌ఈబీ2 ఘోస్ట్‌) బాంబు, 970 కిలోల బరువుతో, బంకర్‌ బస్టర్‌గా రూపొందించబడింది. ఇది 7 మీటర్ల గట్టి సీ50 కాంక్రీటును ఛిద్రం చేయగలదు, అమెరికా బంకర్‌ బస్టర్‌ల (2.4 మీటర్ల సీ35 కాంక్రీటు) కంటే గణనీయంగా శక్తివంతమైనది. ఒక ద్వీపంలో జరిపిన పరీక్షలో, ఈ బాంబు 90 మీటర్ల లోతుకు చొచ్చుకుపోయి, 160 మీటర్ల వ్యాసంలో కొండచరియలు, గ్యాస్‌ లీక్‌లు, రాతి నిర్మాణాల విధ్వంసాన్ని సృష్టించింది. దీని ఆలస్య విస్ఫోటన విధానం (240 మిల్లీసెకన్లు) గరిష్ఠ నష్టాన్ని కలిగిస్తుంది.

Also Raad: చైనాలో ఉచిత విద్య ఈ స్థాయిలో.. వందేళ్లయినా మనకు కష్టమే

టర్కీ రక్షణ వ్యూహం
గాజాప్, హయాలెట్‌ బాంబుల ఆవిష్కరణ టర్కీ స్వదేశీ రక్షణ ఆయుధాలపై దృష్టి సారించడం, విదేశీ ఆధారితతను తగ్గించే లక్ష్యాన్ని సూచిస్తుంది. ఈ బాంబులు నాటో ప్రమాణాలకు అనుగుణంగా ధృవీకరించబడ్డాయి, ఎఫ్‌16 జెట్‌లతో అనుకూలంగా ఉన్నాయి. భవిష్యత్తులో డ్రోన్‌ల ద్వారా వీటిని ప్రయోగించే అవకాశం టర్కీ యొక్క యుద్ధ వ్యూహాలను మరింత బలోపేతం చేస్తుంది.

Leave a Comment