Chandrababu vs Jagan: జగన్( Y S Jagan Mohan Reddy ) హయాంలో చాలామంది అధికారులు బాధితులుగా మారారు. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పనిచేసిన నేతలను టార్గెట్ చేసుకుంది వైసీపీ సర్కార్. జగన్ చర్యలకు అటువంటి అధికారులంతా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప్రధానంగా ఇద్దరు అధికారులు తీవ్ర అవస్థలు పడ్డారు. వైసిపి వారిని ప్రత్యర్ధులుగా చూసింది. చాలా రకాలుగా చికాకు పెట్టింది. ఆ ఇద్దరే ఏబీ వెంకటేశ్వరరావు, నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఈ ఇద్దరు జగన్ సర్కార్ బాధితులే. ఎంతో బాధించబడ్డారు కూడా. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు అధికారులు చంద్రబాబు సర్కార్ను టార్గెట్ చేస్తుండడం విశేషం. ఒకప్పుడు చంద్రబాబు నాయకత్వానికి జై కొట్టిన వీరిద్దరూ.. ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు వారు ఎందుకలా ప్రవర్తిస్తున్నారు అన్నది తెలియాల్సి ఉంది.
Also Read: చంద్రబాబు సింగపూర్ టూర్ పై పెద్దిరెడ్డి ‘పెద్ద’ కుట్ర?
అడుగడుగునా అవమానాలు..
చంద్రబాబు సర్కారులో కీలక అధికారిగా ఉండేవారు ఏ వి బి వెంకటేశ్వరరావు( ABP Venkateswara Rao ). ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారి. డీజీపీ హోదాతో ఉండేవారు. సీనియారిటీ ప్రకారం పరిగణలోకి తీసుకుంటే మాత్రం ఆయనను డీజీపీగా ఎంపిక చేయాలి. కానీ జగన్ సర్కార్ అలా చేయలేదు. అడుగడుగునా అవమానాలకు గురిచేసింది. దానికి కారణం ఆయన చంద్రబాబు సర్కారులో కీలకమైన నిఘా వర్గాల అధిపతిగా ఉండడమే. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా నిఘా సమాచారాన్ని సేకరించారు అన్న విమర్శ ఆయనపై ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన టార్గెట్ అవ్వడానికి అదే ప్రధాన కారణం. రకరకాల అభియోగాలు మోపి ఆయనపై వేటు వేసింది జగన్ సర్కార్. సుప్రీంకోర్టుకు వెళ్లి తన యధా స్థానాన్ని తెచ్చుకున్నారు ఏబీవీ. అయితే రిటైర్మెంట్ రోజు నాడే బాధ్యతలు తీసుకొని పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. అంతలా జగన్ సర్కారులో అవమానాలను ఎదుర్కొన్నారు ఏబీవీ వెంకటేశ్వరరావు.
నిమ్మగడ్డ కు ఇబ్బందులు..
మరోవైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్( Ramesh Kumar ) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉండేవారు. ఆయన చంద్రబాబు సన్నిహితుడని అనుమానించారు జగన్. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి తన ఆదేశాలు పాటించలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను విధుల నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. దొడ్డి దారిన జస్టిస్ కనకరాజన్ ను ఎన్నికల అధికారిగా తీసుకొచ్చారు. కరోనా సమయంలో ప్రత్యేక అంబులెన్స్ లో ఆయనను రప్పించి ఎన్నికల అధికారిగా బాధ్యతలు అప్పగించారు. సుప్రీం కోర్టుకు వెళ్లి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి యధా స్థానంలో చేరారు. అటు తరువాత తన పదవీ విరమణ చేశారు. అయితే ఆ కాలంలో ఆయనకు జగన్ సర్కార్ నుంచి అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఈ ఇద్దరు జగన్ బాధిత అధికారులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డామేజ్ చేశారు.
Also Read: విజయసాయిరెడ్డిని వీడని ‘భీమిలి’ నిర్మాణాలు!
సరైన గుర్తింపు లేదని..
అయితే వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో.. ఇబ్బందులు పడిన ఈ ఇద్దరు అధికారులు.. టిడిపి కూటమి అధికారంలోకి వస్తే మంచి గుర్తింపు ఉన్న పదవులు వస్తాయని ఆశించారు. కానీ ఏబీవీ వెంకటేశ్వరరావుకు పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ పదవి లభించింది. అయితే అది తన స్థాయికి తగినది కాదని.. సున్నితంగా తిరస్కరించారు. మరోవైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సైతం ఎటువంటి గుర్తింపు లేకుండా పోయింది. దీంతో ఏవీబీ వెంకటేశ్వరరావు జగన్ బాధితులను కలిసి.. వారికి న్యాయం చేయాలని చంద్రబాబు సర్కార్ పై డిమాండ్ చేస్తున్నారు. అనేక రకాల డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు. ఇంకోవైపు బనకచర్ల ప్రాజెక్టు విషయంలో చంద్రబాబుకు అడ్డంకిగా నిలుస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అయితే అమరావతి రాజధాని లో రెండో విడత భూ సమీకరణను వ్యతిరేకిస్తున్నారు. రైతుల తరఫున ప్రకటనలు జారీ చేస్తున్నారు. అయితే ఒకప్పటి జగన్ బాధిత అధికారులు .. చంద్రబాబును సైతం టార్గెట్ చేస్తుండడం చర్చనీయాంశం అవుతోంది.