గత కొంత కాలంగా BSNL సూపర్ ఆఫర్లతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. జియో, ఎయిర్‌టెల్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుంది. గతేడాది వాటి రేట్లు పెరగడంతో చాలా మంది బీఎస్ఎన్‌ఎల్ వైపు మళ్లారు. దాంతో ఈ కంపెనీ కస్టమర్ల సంఖ్య భారీగా పెరిగింది. అందుకు తగ్గట్లే ఆఫర్లు కూడా ప్రకటిస్తుంది. ఈ క్రమంలో జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రైవేట్ కంపెనీలకు బిగ్ షాకిస్తూ BSNL స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఆజాదీ కా ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ను రూ.1కే అందుబాటులోకి తెచ్చింది. డేటా, కాలింగ్, ఎస్ఎమ్ఎస్, ఉచిత సిమ్ ప్రయోజనాన్ని అందిస్తోంది. బీఎస్ఎన్‌ఎల్ కొత్త సిమ్ తీసుకోవాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు.
BSNL 1 ప్లాన్ వివరాలు
ఈ రూ.1 ప్లాన్‌తో మీరు ప్రతిరోజూ 2జీబీ హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 100 ఎస్ఎమ్ఎస్‌ల ప్రయోజనాన్ని పొందుతారు. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఆఫర్ ఆగస్టు 1 నుండి ఆగస్టు 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే మీరు ఆగస్టు 31 లోపు ఈ ప్లాన్‌ను తీసుకోలేకపోతే, మీరు ఈ అవకాశాన్ని కోల్పోతారు. ఆసక్తిగల కస్టమర్లు ఈ ఆఫర్‌ను పొందడానికి వారి సమీప బీఎస్ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా రిటైలర్‌ను సందర్శించవచ్చు.
ప్రస్తుతం, జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఇలాంటి ఆఫర్‌ను అందించడంలేదు. కానీ త్వరలో ఇలాంటి ఆఫర్‌ను అందించే అవకాశం ఉంది. ట్రాయ్ డేటా ప్రకారం.. జూన్ 30, 2025 నాటికి, బీఎస్ఎన్ఎల్ 305,766 వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. దీన్ని మొత్తం యూజర్ బేస్ 90,464,244కి చేరుకుంది. ఇందులో 29,822,407 గ్రామీణ కస్టమర్లు ఉన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..