Avoid Mental Stress: నేటి ఉరుకుల పరుగుల జీవన విధానం అందరిని శారీరకంగా. మానసికంగా ఒత్తిడికి గురిచేస్తుంది. పొట్టి ప్రపంచంలో పోటీ పడకపోతే రేసులో నిలవలేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో అందరూ ఒత్తిడిని తట్టుకొని.. కానీ సంవత్సరాలను త్యాగం చేస్తూ పోటీపడుతున్నారు. ఇలాంటి పనితీరు ఉత్పాదకతపై ప్రభావం చూపుతోంది. అనేక కార్పొరేట్ సంస్థలు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలులోకి తెచ్చాయి. కొన్ని సంస్థలు రోజు యోగా తరగతులు నిర్వహిస్తున్నాయి. అయినా రోజువారి పని ఒత్తిడి ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారుతుంది. పరిస్థితిని గుర్తించిన సీడన్ కు చెందిన ఒక సంస్థ తమ ఉద్యోగుల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఉద్యోగులకు పని గంటల్లో 30 నిమిషాల ‘హస్తప్రయోగ విరామం’ అనుమతించింది, దీనికోసం ప్రత్యేక ‘రెస్ట్ స్టేషన్లను’ ఏర్పాటు చేసింది. ఈ విరామం ఉద్యోగులకు మానసిక విశ్రాంతిని కల్పించి, ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుందని సంస్థ వ్యవస్థాపకురాలు ఎరికా లస్ట్ తెలిపారు. ఈ కార్యక్రమం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read: నాగార్జున కొట్టిన దెబ్బలకు ముఖం వాచిపోయింది… హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
మానసిక ఆరోగ్యం, పని ఒత్తిడి తగ్గింపు..
ఈ కార్యక్రమం ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడటం, పని స్థలంలో ఒత్తిడిని తగ్గించడం, ఉత్పాదకతను పెంచేందుకు దోహదపడుతుందని ఎరికా లస్ట్ వెల్లడించారు. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం, హస్తప్రయోగం ఒత్తిడి తగ్గించడంలో, హార్మోనల్ సమతుల్యతను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఈ విరామం ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, దృష్టిని మెరుగుపరుస్తుందని సంస్థ భావిస్తోంది. అయితే, ఈ విధానం సాంప్రదాయ కార్యాలయ నిబంధనలకు విరుద్ధంగా ఉండటం సరికొత్త చర్చకు దారితీసింది.
ఇతర దేశాల్లో కష్టమే..
స్వీడన్లో లైంగిక స్వేచ్ఛ, వ్యక్తిగత స్వాతంత్ర్యంపై బహిరంగ దృక్పథం ఈ విధానం అవలంబిస్తుంది. హస్త పయోగ విరామంపై ఈ దేశంలో ఎవరికీ పెద్దగా అభ్యంతరం ఉండదు. కానీ భారత్ తోపాటు సంప్రదాయ ఇస్లామిక్ దేశాలలో దీని అమలు సాంస్కృతిక సున్నితత్వం, కార్యాలయ నీతి ప్రమాణాల కారణంగా సవాళ్లను ఎదుర్కొనవచ్చు. గోప్యతా ఆందోళనలు, సహోద్యోగుల మధ్య సౌకర్య స్థాయిలు, సంస్థ పరిపాలనా విధానాలు ఈ కార్యక్రమాన్ని ప్రభావితం చేస్తాయి.