Chiranjeevi Srikanth Odela: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా గొప్ప గుర్తింపైతే ఉంది. గత 50 సంవత్సరాల నుంచి ఆయన ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ తో పోటీపడే స్థాయికి తెలుగు సినిమా ఇండస్ట్రీ ని తీసుకెళ్లిన ఘనత కూడా తనకే దక్కుతుంది… చిరంజీవి చేస్తున్న సినిమాల విషయంలో చాలా ఆచితూచి మరి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమాని పూర్తి చేశాడు. ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాతో పాటుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న మరొక సినిమా కూడా సెట్స్ మీద ఉంది. ఈ రెండు సినిమాలను తొందర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే అనిల్ రావిపూడి సినిమాని 2026 సంక్రాంతి కానుక గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామంటూ ముందే అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమాతో వాళ్ళు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత చిరంజీవి శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా డిలే అవుతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: కింగ్డమ్ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..విజయ్ దేవరకొండ కి మరో దెబ్బ!
ఎందుకంటే శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నాని తో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవ్వడానికి ఇంకా చాలా సమయం పడుతోంది. తద్వారా అనిల్ రావిపూడి తో చేస్తున్న సినిమాను నవంబర్ వరకు కంప్లీట్ చేస్తాడట. దాంతో శ్రీకాంత్ కోసం వెయిట్ చేస్తే చిరంజీవి చాలా కాలం పాటు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
అందువల్లే ఆయన ఆ స్లాట్ లో బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. మరి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా చేయడానికి చిరంజీవి పెద్దగా ఆసక్తి చూపించనట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఒకవేళ ప్యారడైజ్ సినిమా సక్సెస్ అయితే చిరంజీవి అతనితో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.
Also Read: ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేసిన కథతోనే.. సేతుపతితో పూరి సినిమా..?
అలా కాకుండా ప్యారడైజ్ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం శ్రీకాంత్ ఓదెల ను పక్కన పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి ఏది ఏమైనా కూడా చిరంజీవి ఎలాంటి ప్రణాళికతో ముందుకు సాగుతున్నాడు. ఒకవేళ శ్రీకాంత్ ను పక్కన పెడితే ఆయన స్లాట్లో ఏ దర్శకుడి తో సినిమాను చేస్తాడు అనేది కూడా కీలకమైన అంశంగా మారింది…