రెట్రో గెటప్ లో పవన్ కళ్యాణ్ చిందులు..’ఉస్తాద్ భగత్ సింగ్’

Ustad Bhagat Singh New Look: వరుస ఫ్లాప్స్ లో ఉన్న పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి ‘గబ్బర్ సింగ్’ చిత్రం ద్వారా తిరుగులేని బ్లాక్ బస్టర్ ని అందించి, ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొట్టిన డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar). ఇప్పుడు ఆయన మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ తో చేస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). గత 40 రోజుల నుండి విరామం లేకుండా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం, ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లోని 7 ఎకరాల్లో సాంగ్ షూటింగ్ ని జరుపుకుంటుంది. రీసెంట్ గానే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో క్లైమాక్స్ షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు సాంగ్ షూటింగ్ ని జరుపుకుంటుంది. పవన్ కళ్యాణ్ పైన మాత్రమే ఈ పాటని చిత్రీకరిస్తున్నారు. ఆగష్టు 8వ తేదీ వరకు నాన్ స్టాప్ గా సాంగ్స్ చిత్రీకరణ జరగనుంది.

Also read: కింగ్డమ్ మూవీ ఓవర్సీస్ రివ్యూ వచ్చేసింది..సినిమా పరిస్థితి ఏంటంటే?

అయితే హరీష్ శంకర్ అంటే కచ్చితంగా అభిమానులకు ఫుల్ మీల్స్ ఇచ్చే స్టఫ్ ని అందిస్తాడు అనే విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కూడా అభిమానులకు విజువల్ ఫీస్ట్ ఇచ్చే ఎన్నో సన్నివేశాలను ప్లాన్ చేసాడట. అదే విధంగా రెట్రో గెటప్ లో పవన్ కళ్యాణ్ తో స్టెప్పులు కూడా వేయించబోతున్నాడట. ఈ పాటకు దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయబోతున్నాడు. రెట్రో అంటే హీరో సూర్య రెట్రో కాదు. రెట్రో అంటే పాత వింటేజ్ పాటలు ఉంటాయి కదా. అలా అన్నమాట. ఉదాహరణకు ‘తీన్ మార్’ చిత్రం లో ‘వయ్యారాల జాబిల్లి’ అనే మాట మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ పాట తరహాలోనే త్వరలో పవన్ కళ్యాణ్ తో ఒక పాటకు చిందులు వేయించబోతున్నాడట డైరెక్టర్ హరీష్. తీన్ మార్ లో కేవలం పాట మాత్రమే రెట్రో ఫీలింగ్ ని కలిగిస్తుంది. కానీ ఇందులో పవన్ కళ్యాణ్ గెటప్ కూడా రెట్రో స్టైల్ లోనే ఉంటుందట.

Also Read:  ‘వార్ 2’ ఫలితం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రశాంత్ నీల్!

ఇలా ఇప్పటి వరకు తన కెరీర్ లో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చెయ్యలేదు. సరిగ్గా వర్కౌట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, మూవీ లవర్స్ కి కూడా ఈ పాట ఒక విజువల్ ఫీస్ట్ లాగానే అనిపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు దూరమై చాలా కాలం అయ్యింది. అజ్ఞాతవాసి చిత్రం తర్వాత మూడేళ్ళ పాటు విరామం తీసుకొని ఆయన నటించిన సినిమాలన్నీ సీరియస్ కాన్సెప్ట్ మీద తెరకెక్కిన సినిమాలే. అభిమానులు ఎనర్జీ కి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉండే పవన్ కళ్యాణ్ ని బాగా మిస్ అవుతున్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం తో అభిమానులకు కావాల్సిన పవన్ కళ్యాణ్ ని వెండితెర మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాడు హరీష్ శంకర్.

Leave a Comment