రీ రిలీజ్ సినిమాల్లో కూడా 'నాన్ బాహుబలి రికార్డ్స్' రానుందా..? ఇదేమి ప్లానింగ్ సామీ!

Re-Release Movie Records

Re-Release Movie Records: తెలుగు చలన చిత్ర పరిశ్రమ రూపు రేఖలను మార్చేసిన చిత్రం ‘బాహుబలి'(Baahubali). ఈ సినిమా తర్వాత మన స్థాయి అంతర్జాతీయ లెవెల్ కి ఎదిగింది. ప్రతిభ ఉన్న ప్రతీ దర్శకుడు తన విజన్ ని పాన్ ఇండియా లెవెల్ లో విస్తరించేసేందుకు ఈ సినిమా ఇచ్చిన ధైర్యం సాధారణమైనది కాదు. అప్పట్లో భారీ బడ్జెట్ సినిమాలు చెయ్యాలంటే నిర్మాతలు భయపడేవారు. కానీ ఈ చిత్రం విడుదల తర్వాత వంద కోట్ల రూపాయిల బడ్జెట్ సినిమాలను తియ్యడం చాలా సాధారణం అయిపోయింది. అలాంటి స్థాయికి తీసుకెళ్లింది ఈ చిత్రం. మొదటి భాగం ప్రపంచవ్యాప్తం గా 650 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడితే, రెండవ భాగం 2000 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ ఈ రికార్డుని బద్దలు కొట్టిన సినిమా మరొకటి రాలేదు. ఈ రికార్డుని ఎలాగో బద్దలు కొట్టలేమి కాబట్టి, ఈ సినిమా తర్వాత ఉన్న రికార్డునే ఇండస్ట్రీ రికార్డు గా భావించి నాన్ బాహుబలి రికార్డు అనే క్యాటగిరీ ని తీసుకొచ్చారు ట్రేడ్ పండితులు.

Also Read: ‘పవర్ స్టార్’ ట్యాగ్ కోసం విజయ్ దేవరకొండ విశ్వప్రయత్నాలు?

ఇప్పుడు ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా అక్టోబర్ 31 న ‘బాహుబలి: ది ఎపిక్'(Baahubali : The Epic) పేరుతో రెండు వెర్షన్స్ ని కలిపేసి 5 గంటల సినిమాగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకి కూడా ఇప్పుడు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. బుక్ మై షో యాప్ లో అప్పుడే ఈ చిత్రానికి లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. కొత్తగా విడుదలయ్యే పాన్ ఇండియన్ సినిమాలకు కూడా ఇన్ని లైక్స్ రాకపోవడం విశేషం. చూస్తుంటే రీ రిలీజ్ లో కూడా ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేసేలాగా అనిపిస్తుంది. అంతే కాదు మూవీ టీం మొత్తం ప్రొమోషన్స్ ని కొత్త సినిమాకు ఎలా చేస్తారో, అలా ప్రమోట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట.

Also Read: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం తేదీ వచ్చేసింది..!

సినిమాల్లో ఎలా అయితే నాన్ బాహుబలి క్యాటగిరీ వచ్చిందో, రీ రిలీజ్ సినిమాల్లో కూడా ‘నాన్ బాహుబలి’ క్యాటగిరీ వచ్చేలా అనిపిస్తుంది. ఊపు చూస్తుంటే ఈ చిత్రం కేవలం రీ రిలీజ్ ద్వారానే రెండు వందల కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి సునామీ ని ఆశిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మన టాలీవుడ్ లో రీ రిలీజ్ రికార్డ్స్ కింగ్స్ అంటే పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు మాత్రమే. వీళ్లిద్దరి చుట్టూనే రీ రిలీజ్ రికార్డ్స్ తిరుగుతూ ఉండేవి. ఇప్పుడు బాహుబలి తో ప్రభాస్ ఈ లిస్ట్ లోకి చేరబోతున్నాడు. చూడాలి మరి అక్టోబర్ 31 న వెండితెర పై ‘బాహుబలి – ది ఎపిక్ ‘ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది అనేది.

Leave a Comment