మార్కెట్లోకి మరో 3 కొత్త బైక్ లు… వివరాలు ఇవే

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్లోకి రకరకాల బైక్స్ వస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యులు కూడా కొనుగోలు చేసేలా వాహనాలు మార్కెట్లో లాంచ్ అవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా హీరో, హోండా నుంచి వచ్చే వాహనాలను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే కంపెనీలు కూడా కొత్త బైక్స్ లాంచ్ చేస్తున్నాయి. ఇక 2025 డిసెంబర్ వరకు… మరో కొత్త మూడు మోడల్ బైక్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి.

ఇందులో హీరో గ్లామర్ 125 సిసి బైక్ ఒకటి. గతంలో ఉన్న గ్లామర్ కంటే అప్డేటెడ్ వెర్షన్ లో భాగంగా ఈ బైక్ తీసుకొస్తున్నారట. దసరా పండుగ సందర్భంగా… ఈ బైక్ లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. హోండా షైన్ 100 డిఎక్స్ ( Honda Shine 100 DX) బైక్ కూడా హోండా తీసుకువస్తుంది.

ఈ బైకు ధర ఇంకా ఫిక్స్ కాలేదు కానీ… ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఈ బైక్స్ కోసం బుకింగ్ ప్రారంభమైంది. హోండా సిబి 125 హార్నెట్ ( Honda CB 125 Hornet) బైక్ కూడా మార్కెట్లోకి రాబోతోంది. ఇవాల్టి నుంచే బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. ఈ బైక్ కు కొత్తగా యూఎస్బీ (USB ) చార్జింగ్ పాయింట్ కూడా అందించబోతున్నారు. 4.2 అంగుళాల డిస్ప్లే కూడా ఈ బైక్ కు అందిస్తున్నారు. 123.94 సీసీ ఇంజన్ తో ఈ బైక్ నడుస్తుంది.

Leave a Comment