మారుతి సుజుకి ఆర్థిక ఫలితాలు – Visalaandhra

న్యూదిల్లీ: మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌ డైరెక్టర్ల బోర్డు గురువారం ఏప్రిల్‌-జూన్‌, ఆర్థిక సంవత్సరం 2025-26 (త్రైమాసికం 1) కాలానికి ఆర్థిక ఫలితాలను ఆమోదించింది. త్రైమాసికం 1లో, దేశీయ ప్రయాణీకుల వాహన పరిశ్రమ మందగమన డిమాండ్‌ వాతావరణాన్ని కొనసాగిస్తోంది. కంపెనీకి, దేశీయ అమ్మకాలలో 4.5% క్షీణత ఎగుమతుల్లో 37.4% వృద్ధి ద్వారా భర్తీ చేయబడిరది. దీని ఫలితంగా త్రైమాసికంలో మొత్తం అమ్మకాల పరిమాణం 1.1% పెరిగింది, ఇది సంవత్సరం ఆధారంగా. ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం 527,861 వాహనాలను విక్రయించింది, వీటిలో దేశీయ అమ్మకాలు 430,889 యూనిట్లు, ఎగుమతులు 96,972 యూనిట్లు. ఈ త్రైమాసికంలో, కంపెనీ నికర అమ్మకాలు రూ.366,247 మిలియన్లకు చేరాయి, ఇది ఎఫ్‌వై2024-25 త్రైమాసికంలో రూ.338,753 మిలియన్ల నుండి పెరుగుదల కన్పించింది. ఈ త్రైమాసికంలో నికర లాభం క్యూ1 ఎఫ్‌వై2024-25లో రూ.36,499 మిలియన్ల నుండి రూ.37,117 మిలియన్లకు పెరిగింది. ఇది 1.7% వృద్ధిని చూపిస్తున్నది.

Leave a Comment