ఫిరాయింపుల చట్టాన్ని అవహేళన చేసిందే BRS.. కడియం శ్రీహరి హాట్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ (BRS) నుంచి గెలిచి కాంగ్రెస్ (Congres) పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై 3 నెల్లలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతల కామెంట్లపై మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి (Kadiyam Srihari) స్పందించారు. అసలు ఫిరాయింపు చట్టాన్ని అవహేళల చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు. నాడు కాంగ్రెస్‌ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని వారు రాజీనామాలు చేయకుండానే మంత్రి పదవులు ఇవ్వలేదా అని ఆయన ప్రశ్నించారు. నాడు వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ విధ్వంసం చేసి నేడు ఆ పార్టీ నేతలు నీతులు చెప్పడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఉప ఉన్నికకు భయపడే వ్యక్తిని కాదని.. ప్రజాక్షేత్రంలో పోరుకు తానెప్పుడూ సిద్ధమేనని కడియం శ్రీహరి బీఆర్ఎస్‌ సవాల్ విసిరారు.��

Leave a Comment