71st National Film Awards 2025: నేడు 71 వ నేషనల్ అవార్డ్స్ ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మన తెలుగు చిత్రాల్లో ‘భగవంత్ కేసరి’, ‘బేబీ’, ‘హనుమాన్’ మరియు ‘బలగం’ చిత్రాలకు కొన్ని ముఖ్యమైన క్యాటగిరీస్ లో అవార్డులు వచ్చాయి. కానీ రావాల్సిన సినిమాలకు అవార్డు రాలేదని నెటిజెన్స్ మండిపడుతున్నారు. అలాంటి సినిమాల్లో ఒకటి నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నటించిన ‘హాయ్ నాన్న'(Hai Nanna). 2023 వ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదలైన ఈ చిత్రం పెద్ద కమర్షియల్ హిట్ అవ్వడమే కాదు, డైరెక్టర్ దర్శకత్వ సౌరవ్ ప్రతిభ కి కూడా ప్రశంసల వర్షం కురిసింది. అసలు ఇలాంటి కాన్సెప్ట్ మీద అప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక జంటకి, బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని అనుకోని సమస్యలు ఎదురు అవ్వడం. ఆ సమయం లోనే ఒక భారీ యాక్సిడెంట్ జరిగి హీరోయిన్ కి తీవ్ర గాయాలు అవ్వడం.
Also Read: బాలకృష్ణ సినిమాకు నేషనల్ అవార్డు..నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సమయం!
తలకు గట్టి దెబ్బ తగలడం వల్ల ఆమె గతాన్ని పూర్తిగా మర్చిపోవడం, దీంతో హీరోయిన్ తండ్రి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లిపోవడం వంటి సన్నివేశాలు చూసేందుకు కొత్తగా అనిపిస్తాయి. కొన్నేళ్ల తర్వాత ఒక సందర్భంలో హీరోయిన్ పెరిగి పెద్ద అయిన తన కూతురుని కలుస్తుంది. కానీ ఆమెకు తన కూతురు అనే విషయం తెలియదు. అలా ఒక స్నేహితురాలిగా కూతురు జీవితం లోకి అడుగుపెడుతుంది. హీరో మాత్రం హీరోయిన్ ని దూరం పెట్టాలని చూస్తాడు, ఇలా కొత్త స్క్రీన్ ప్లే తో చాలా ఆసక్తికరంగా సాగిపోతుంది ఈ సినిమా. ఇలాంటి చిత్రానికి తగిన గుర్తింపు రాకపోవడం నిజంగా అన్యాయమే అని చెప్పాలి. థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిల్చిన ఈ సినిమా, ఓటీటీ లో ఇంకా పెద్ద హిట్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న టాప్ 10 ఇండియన్ మూవీస్ లో ఇది కూడా ఒకటి.
ఇంతటి ఆదరణ దక్కించుకున్న ఈ సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కకపోవడం దురదృష్టకరం. కచ్చితంగా ఎక్కడ అన్యాయం జరిగింది, ఈ సినిమాని జ్యూరీ వరకు చేరకుండా ఎవరో రాజకీయం చేసారంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆరోపిస్తున్నారు. సినిమా ఏ విధంగా చూసుకున్న ‘బేబీ’ కంటే బెటర్ అనొచ్చు. బేబీ లాంటి సినిమాలు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఇలాంటి కొత్త తరహా కాన్సెప్ట్ సినిమాలను ఆదరిస్తేనే కదా, భవిష్యత్తులో ఇలాంటి కాన్సెప్ట్స్ తో సినిమాలు తీసేందుకు దర్శకులు ఆసక్తి చూపిస్తారు. గుర్తింపు లేని పని కోసం ఎవరు మాత్రం కష్టపడతారు చెప్పండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.