విశాలాంధ్ర – కడియం : దివ్యాంగులైన (సి డబ్ల్యు ఎస్ ఎన్) పిల్లలకు ఆరోగ్యంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగుకు భవిత కేంద్రాలు ఆసరాగా ఉంటున్నాయని టీవీసి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాడాల విష్ణు చక్రవర్తి అన్నారు. కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గల భవిత కేంద్రానికి శుక్రవారం ఆయన విచ్చేసారు. బాల బాలికలకు అవసరమైన 15 వేల రూపాయల విలువైన గ్రీన్ మ్యాట్ ను భవితా కేంద్రానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిత కేంద్రంలోని బాలబాలికలకు ఫిజియోథెరఫీ, స్పీచ్ థెరపీ వంటి వాటిలో శిక్షణ అందిస్తున్న ఐఇఆర్పి లు ఎన్ కృష్ణవేణి, ఎం లోవ కుమారి లను అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టి సత్యనారాయణ మాట్లాడుతూ పాఠశాలకు రాలేని దివ్యాంగ పిల్లల కోసం ఉపాధ్యాయులు ప్రతి శనివారం వారి ఇంటి వద్దకే వెళ్లి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని, అదేవిధంగా ప్రతి మంగళవారం భవిత కేంద్రంలోని దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక ఫిజియోథెరపీ క్లాసులు నిర్వహిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల అవసరాన్ని గుర్తించి గ్రీన్ మ్యాట్ బహూకరించిన చక్రవర్తికి కృతజ్ఞతలు తెలిపారు
