కింగ్డమ్ మూవీ యూఎస్ఏ రివ్యూ…హిట్టా..? ఫట్టా..?

Kingdom Movie USA Review: విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన చాలా సినిమాలు తనకి మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి. అయితే రీసెంట్ గా ఆయన చేసిన సినిమాలు ఆశించిన మేరకు సక్సెస్ లను సాధించకపోవడంతో ఆయన కొంతవరకు వెనుకబడిపోయాడు. ప్రస్తుతం ఆయన చేసిన కింగ్డమ్ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ఈ సినిమా కథ విషయానికి వస్తే సూరి(విజయ్ దేవరకొండ) అనే ఒక పోలీస్ ఆఫీసర్ కొన్ని కారణాల వల్ల అండర్ కవర్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇక దానికోసం ఆయన శ్రీలంకలోని ఒక జైల్లో ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది. అక్కడ క్రిమినల్ గా ఉన్న సత్యదేవ్ ను చంపడానికి వెళ్తాడు అయితే మాఫియా మొత్తానికి డాన్ గా ఉంటున్న సత్యదేవ్ తన సొంత అన్నయ్య అని తెలుసుకున్న సూరి..సత్యదేవ్ అలా మాఫియాలోకి రావడానికి కారణాలు ఏంటో తెలుసుకుంటాడు. ఇక ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యను కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పోలీసులకు సూరికి మధ్య ఒక పెను యుద్ధమైతే జరుగుతోంది. మరి తన అన్నయ్యని కాపాడుకున్నాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే…

Also Read: కింగ్ డం రిలీజ్ : అంతలా భయమెందుకు?

విశ్లేషణ

ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి (Goutham Thinnanuri) చాలా యాక్షన్ డ్రామా గా తెరకెక్కించడమే కాకుండా బ్రదర్స్ సెంటిమెంట్ తో తీసి ప్రేక్షకులను మైమరిపింపజేసే ప్రయత్నమైతే చేశాడు. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్ళడమే కాకుండా కథలో పెద్దగా వేరియేషన్స్ లేకపోయిన కూడా ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా హుక్ చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది… ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే ఈ సినిమాకి బాగా వర్క్ అవుట్ అవుతుందనే చెప్పాలి…

ఇక ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ తో సినిమాని అమాంతం టాప్ లెవెల్ కి తీసుకెళ్లాడు. సెకండాఫ్ సినిమా ప్లాట్ గా ముందుకు వెళ్లినప్పటికి ఓవరాల్ గా సినిమాని చూస్తున్న ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని చూసామనే అనుభూతి అయితే కలుగుతోంది…ఇక ఫస్టాఫ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించి, సెకండాఫ్ లో సెంటిమెంట్ ఎక్కువగా చూపించే ప్రయత్నం చేశారు. దీనివల్ల ప్రేక్షకుడికి ఫస్ట్ అఫ్ బావుంది అనే ఆలోచన అయితే కలుగుతుంది. కానీ సెకండ్ హాఫ్ లో చూపించిన ఎమోషన్స్ ఇంకాస్తా వర్క్ అవుట్ అయి ఉంటే బాగుండేది.

ముఖ్యంగా అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగా సెట్ అయింది. అలాగే కొన్ని ఎలివేషన్స్ లో కూడా ఆయన ఇచ్చిన మ్యూజిక్ తో ఆ సీన్లు ప్రేక్షకులకు హై ఫీల్ అయితే ఇచ్చాయి… ఇక గౌతమ్ తిన్ననూరి ఇంతకుముందు సాఫ్ట్ సినిమాలు చేసినప్పటికి ఈ సినిమాతో యాక్షన్ డైరెక్టర్ గా చాలా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా కమర్షియల్ ఎలిమెంట్స్ ని కూడా ఈ సినిమాలో జత చేసి సినిమా మీద హైప్ ని తీసుకురావడంలో ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యాడు…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ ఇంతకుముందు ఎన్నడు చేయనటువంటి ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను మైమరపింపజేశాడు. ఆయన తప్ప ఈ పాత్రను మరెవరు అంత పర్ఫెక్ట్ గా చేయలేరు అనేంతల చేసి ప్రేక్షకులను మెప్పించాడు.

ముఖ్యంగా ఆయన సెకండాఫ్ లో చేసిన యాక్టింగ్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. గత సినిమాల్లో యాక్టింగ్ తో పోలిస్తే ఈ సినిమాలో చేసిన యాక్టింగ్ లో మెచ్యూరిటీ కూడా చాలా వరకు కనిపించింది. ఇంతకు ముందు ఆయన ఏ డైలాగ్ చెప్పిన కూడా అర్జున్ రెడ్డి ఫ్లేవర్ లోనే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఆ స్లాంగ్ మార్చుకొని ఆ పాత్ర తాలూకు ఇంటెన్స్ తెలుసుకొని అందులో లీనమైపోయి డైలాగులు చెబుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు…

ఇక హీరోయిన్ భాగ్య శ్రీ బోర్ సే కి మంచి క్యారెక్టర్ అయితే దొరికింది. ఆమె పెర్ఫార్మ్ చేయడానికి స్కోప్ ఉన్న పాత్ర అయినప్పటికి ఆమె తన పూర్తి నటనను చూపించి రంజింప చేసే ప్రయత్నం అయితే చేసింది… సత్యదేవ్ సైతం విజయ్ దేవరకొండ అన్నగా మాఫియా డాన్ గా మెప్పించే ప్రయత్నం చేశాడు. ఇప్పటివరకు డిఫరెంట్ పాత్రలు చేస్తూ వస్తున్న సత్యదేవ్ కి ఈ పాత్ర ఒక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది…మిగిలిన ఆర్టిస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…

టెక్నికల్ అంశాలు…

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాను అనిరుధ్ సాంగ్స్ పరంగా నిలబెట్టే ప్రయత్నం అయితే చేశాడు. ముఖ్యంగా ఈ సినిమాలో సిచువేషన్ కి తగ్గట్టుగా బ్యాగ్రౌండ్ స్కోర్ ని అందించి సినిమా చూస్తున్న ప్రేక్షకుడిలో ఒక హై ఫీల్ అయితే కలిగించాడు. ఈ మూవీలో వచ్చిన ప్రతి ఎపిసోడ్ సైతం ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేశాయి…ఇక ఈ సినిమాకు విజువల్స్ కూడా చాలా వరకు ప్లస్ అయ్యాయి…

ప్లస్ పాయింట్స్

విజయ్ దేవరకొండ యాక్టింగ్
గౌతమ్ డైరెక్షన్
కొన్ని ఎలివేషన్ సీన్స్
మ్యూజిక్

మైనస్ పాయింట్స్

స్క్రీన్ ప్లే
సెకండాఫ్ లో కొన్ని సీన్స్

రేటింగ్

ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 2.5/5

 

Leave a Comment