Bandla Ganesh Vs Trivikram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఆయన క్రేజ్ ను వాడుకుంటూ చాలామంది దర్శక నిర్మాతలు సూపర్ హిట్ సినిమాలను చేసి భారీగా లాభపడ్డారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉండడం వల్ల అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు తప్ప కంటిన్యూస్ గా సినిమాలైతే చేయలేకపోతున్నాడు. ఇక రీసెంట్ గా హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో కొంతవరకు నిరాశ చెందినట్టుగా తెలుస్తోంది…ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ గాని, బండ్ల గణేష్ గాని ఉంటే ఆ ఈవెంట్ కన్నుల పండుగగా సాగుతుందంటూ చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు చెబుతూ ఉంటారు. కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళు చెప్పే మాటలు ఆయన అభిమానులను చాలా వరకు సంతృప్తి పరుస్తాయి…ఇక పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్లో బండ్ల గణేష్ ఈశ్వర పరమేశ్వర అంటూ మాట్లాడిన మాటలు ఇప్పటికి ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తూ ఉంటాయి.
Also Read: బాలకృష్ణ సినిమాకు నేషనల్ అవార్డు..నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సమయం
ఇక గత కొన్ని రోజుల నుంచి బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ఈవెంట్లకు హాజరు అవ్వడం లేదు కారణం ఏదైనా కూడా ఆయన పవన్ కళ్యాణ్ ని దేవుడిలా కొలుస్తూ ఉంటాడు… కాబట్టి ఆయన వస్తే బాగుంటుందని ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని కోరుకుంటూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ గురించి గతంలో బండ్ల గణేష్ చాలా సందర్భాల్లో గొప్పగా మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ నేను ఎక్కుపెట్టిన బాణం, నా ఆశలా ఆకాశంలో దాగి ఉన్న పిడుగు అంటూ పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో ఇప్పటికి మనకు తారాస పడుతూ ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలో ఓజి సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అటు బండ్ల గణేష్, ఇటు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరూ వస్తే ఎలా ఉంటుంది అంటూ అభిమానులు వాళ్ళిద్దరికి సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు.
వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ గురించి చెబుతుంటే వీళ్ళిద్దరిలో ఎవరు హైలెట్ అవుతారు అనేది ఇప్పుడు కీలకంగా మారనుంది…మరి ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరు కనక ఈ ఈవెంట్ కు వచ్చినట్లయితే ఈవెంట్ సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఒక జోష్ అయితే నింపుతారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు…మరి వీళ్లిద్దరు ఈ ఈవెంట్ కు వస్తారా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
71st National Film Awards 2025: బాలకృష్ణ సినిమాకు నేషనల్ అవార్డు..నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సమయం!