Bhagavanth Kesari Won National Award: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది…ఆ ఫ్యామిలీ నుంచి ఏ ఒక్క హీరో వచ్చిన కూడా భారీ విజయాలను సాధిస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక బాలయ్య బాబు యంగ్ హీరోలతో పోటీపడుతూ భారీ విజయాలను దక్కించుకుంటున్నాడు. వరుసగా విజయాలతో మంచి ఊపు మీద ఉన్న బాలయ్య ఇప్పుడు అఖండ 2 సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే బాలయ్య బాబు హీరోగా 2023 వ సంవత్సరం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన భగవంత్ కేసరి సినిమా నేషనల్ అవార్డును దక్కించుకుంది. ఇక కొద్దిసేపటి క్రితం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన కేంద్రం అందులో ఉత్తమ చిత్రం గా బాలయ్య బాబు నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాను ప్రకటించడం పట్ల పలువురు హర్ష వ్యక్తం చేస్తున్నారు.
Also Read: బాలకృష్ణ సినిమాకు నేషనల్ అవార్డు..నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సమయం!
ఇక ఇదిలా ఉంటే భగవత్ కేసరి సినిమాకి నేషనల్ అవార్డు వచ్చే అంత గొప్పగా ఏం ఉంది. బాలయ్య బాబు సినిమాకి ఎందుకని నేషనల్ అవార్డు ఇచ్చారు అంటు కొందరు కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…ప్రస్తుతం టిడిపి, జనసేన, బిజెపి మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.
కాబట్టి టిడిపి అధినేత అయిన చంద్రబాబు మోడీకి రిఫర్ చేయడం వల్లే బాలయ్య బాబు సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు అయితే చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా భగవంత్ కేసరి సినిమాకి నేషనల్ అవార్డు ఇచ్చే అంత గొప్ప సినిమా అయితే కాదని పలువురు కామెంట్లు చేస్తూ ఉండడంతో బాలయ్య బాబు అభిమానులు సైతం కొంతవరకు నిరాశ చెందుతున్నారనే చెప్పాలి…
ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమా చేసిన కూడా మంచి ఐడెంటిటిని సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న చాలామంది నటులు ఉన్నప్పటికి బాలయ్య సినిమాకు మాత్రమే ఈ అవార్డు రావడం పట్ల కొంతమంది హర్షం వ్యక్తం చేస్తుంటే, మరి కొంతమంది విమర్శలను గుప్పిస్తున్నారు…మొత్తానికైతే మన తెలుగు సినిమాకి నేషనల్ అవార్డ్ రావడం అనేది నిజంగా మనందరం గర్వించదగ్గ విషయం అనే చెప్పాలి…