World Most Popular Meat: నాన్ వెజ్ అంటే మనకే కాదు..యావత్ ప్రపంచానికి ఇష్టమే..ఇంతకీ వేటిని ఎక్కువ తింటున్నారో తెలుసా?

World Most Popular Meat: ఆదివారం వస్తే నాన్ వెజ్ కావాలి. కారం, ఉప్పు, నూనె, మసాలాల సమ్మేళితమైన ముక్క నోట్లోకి వెళ్లాలి. పసందైన రుచిని నోటికి అందించాలి. ఆదివారం మాత్రమే కాదు పండుగలప్పుడు, వేడుకలప్పుడు కచ్చితంగా ముక్కలు తినాల్సిందే. ముక్కలు తినకపోతే చాలామందికి తిండి సహించదు. అందుకే నాన్ వెజ్ అంటే చాలామంది పడి చస్తుంటారు. ప్రాంతాలకు తగ్గట్టుగా నాన్ వెజ్ వండుకుంటూ పండగ చేసుకుంటారు.

Also Read: ధోని సొంత ఊరిలో.. అద్భుతమైన వంటకం.. తినడానికి ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు

మనదేశంలో అన్ని రకాల మాంసాలను తినేవారు ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాలలో ఒకరకమైన మాంసాన్ని తింటారు.. కొన్ని ప్రాంతాలవారు పంది మాంసాన్ని ఇష్టపడుతుంటారు. ఇంకా కొన్ని ప్రాంతాల వారు గొడ్డు మాంసాన్ని ఇష్టంగా తింటారు. మెజారిటీ ప్రజలు మాత్రం ఎక్కువగా మటన్, చికెన్, ఫిష్ లాగిస్తుంటారు.. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో మటన్ వినియోగం అధికంగా ఉంటుంది. అదే స్థాయిలో చికెన్ కూడా ఉంటుంది. ఇక పంది మాంసం, గొడ్డు మాంసం వినియోగం కూడా భారీగానే ఉంటుంది. చేపలు, రొయ్యలు, పీతలను కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇక ఆంధ్ర ప్రాంతంలో అయితే సీ ఫుడ్ అధికంగా లభిస్తుంది కాబట్టి లొట్టలు వేసుకొని తింటారు. కేవలం భారత్, తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా.. యావత్ ప్రపంచం నాన్ వెజ్ ను ఇష్టంగా తింటుంది. ఓసారి ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మనుషుల జిహ్వ చాఫల్యానికి ఎన్ని జంతువులు బలవుతున్నాయో లెక్క కట్టింది.

ప్రతి ఏడాది 45 కోట్ల మేకలను మనుషులు లాగిస్తున్నారు. 55 కోట్ల గొర్రెలను తినేస్తున్నారు. 150 కోట్ల పందులను ముక్కలుగా మార్చి నంచుకుంటున్నారు. 700 కోట్ల కోళ్లను అవలీలగా మాయం చేస్తున్నారు. రెండు నుంచి మూడు లక్షల కోట్ల చేపలను అమాంతం ఆమ్యామ్యం చేస్తున్నారు. వాస్తవానికి ప్రపంచంలో చాలామంది ఎక్కువగా పంది మాంసాన్ని, గొడ్డు మాంసాన్ని తింటారు అనుకుంటారు. కానీ అది కొన్ని దేశాల్లో మాత్రమే.. అమెరికా, చైనా, ఇతర దేశాలలో పంది మాంసం వినియోగం అధికంగా ఉంటుంది. ఇక్కడ గొడ్డు మాంసం కూడా విపరీతంగా తింటారు. అయితే మిగతా దేశాలలో మాత్రం ఇలా లేదు. ఇక్కడ కోళ్లు, మేకలు, గొర్రెల మాంసం వినియోగం అధికంగా ఉంది. వీటన్నిటికంటే చేపల వినియోగం అధికంగా ఉంది. అందువల్లే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తినే మాంసంలో చేపలు మొదటి స్థానాన్ని ఆక్రమించాయి.

Also Read: డయాబెటిక్ ఉన్నా పర్వాలేదు.. ఈ బిర్యానీని లొట్టలు వేసుకుంటూ తినొచ్చు..

“మిగతా మాంసం రుచికరంగా ఉంటుంది. కానీ ప్రజలు మొత్తం చేపలకే జై కొడుతున్నారు. చేపల్లో విటమిన్లు, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. పైగా వీటి ధర కూడా తక్కువగా ఉంటుంది. అందువల్లే చేపలను అధికంగా తీసుకుంటున్నారు. చేపలు పుష్కరంగా ఉంటాయి. అనేక పోషకాలతో ఉంటాయి. అందువల్లే వీటిని తినడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. చేపలు పేదల ఆహారంగా ఉంటుంది. బహుశా అందువల్లే వినియోగం ఈ స్థాయిలో ఉంటున్నదని” సర్వే చేసిన ఆ సంస్థ ప్రకటించింది.

Leave a Comment