Viral Video: సర్జరీ చేస్తోండగా భూకంపం.. రోగి ప్రాణాలు కాపాడేందుకు డాక్టర్లు ఏం చేశారంటే.. వైరల్ వీడియో – Telugu News | Russian doctors perform surgery during kamchatka earthquake video goes viral in social media

రష్యాలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంప ధాటికి భవనాలు ఊగిపోయాయి. అటువంటి సమయంలో భూకంపానికి భయపడకుండా ఓ రోగి ప్రాణాలను రక్షించిన విద్య సిబ్బందికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. భూమి కంపించే సమయంలో ఒక ఆసుపత్రిలో ఒక రోగికి ఆపరేషన్ చేస్తున్నారు. ఈ ఆపరేషన్ మధ్యలో ఉండగా భూమి కంపించడం మొదలైంది. దీంతో అక్కడ ఒకసారిగా కలకలం మొదలైంది. ఆపరేషన్ థియేటర్ లో లైట్లు వణికిపోయినా, ఫర్నిచర్ కదిలిపోతుంది. అయినా సరే ఆపరేషన్ చేస్తున్న డాక్టర్లు, సిబ్బంది ఏ మాత్రం కంగారు పడలేదు. తమ దృష్టిని రోగికి ఆపరేషన్ పూర్తి చేసి ప్రాణాలను కాపాడంపై పెట్టారు. తమ చుట్టుపక్కల ఏమి జరుగుతుందో తమకి సంబంధం లేదన్నట్లు.. తమ పనిని అత్యంత శ్రద్ధతో కొనసాగించారు. ఆపరేషన్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు.

ఈ సమయంలో అక్కడ ఉన్న CCTV ఫుటేజీలో ఇదంతా రికార్డ్ అయింది. ప్రసుత్తం డాక్టర్ల దైర్య సాహసం అంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. డాక్టర్ల సేవా భావం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రియల్ హీరోలు అంటూ సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఒకవైపు ప్రకృతి ప్రకోపాన్ని తెలియజేస్తుంది.. మరోవైపు భయానక పరిస్థితి ఉన్నా మనిషి సేవా నిబద్ధతకి గుర్తుగా నిలిచింది. డాక్టర్ల సేవా నిరతి ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి కాదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment