Site icon Desha Disha

Trump Against India: ఇండియాతో కటీఫ్.. పాకిస్తాన్ తో దోస్తీ.. దెబ్బకొట్టిన ట్రంప్.. కారణం ఇదే

Trump Against India: ఇండియాతో కటీఫ్.. పాకిస్తాన్ తో దోస్తీ.. దెబ్బకొట్టిన ట్రంప్.. కారణం ఇదే

Trump Against India

Trump Against India: ‘మోదీ.. నా బెస్ట్‌ ఫ్రెండ్‌.. భారత్‌–అమెరికా మధ్య మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. సైనిక పరంగానూ పరస్పర సహకారం ఉంది. భారత్‌తో త్వరలో కీలక వాణిజ్య ఒప్పందం జరుగుతుంది’ ఇవీ మొన్నటి వరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేశారు. కానీ ఇప్పుడు అదే ట్రంప్‌ నాలుక మడత పెట్టాడు. పాకిస్తాన్‌తో చేతులు కలిపి.. భారత్‌ను మరో దెబ్బ తీశాడు. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయం భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య విధానాలు, ఇంధన భద్రతపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.

Also Read: ఆపరేషన్ సింధూర్.. ఇన్నాళ్లకు సంచలన నిజం చెప్పిన మోడీ

పాకిస్తాన్‌తో ట్రంప్‌ కీలక ఒప్పందం..
ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్రూత్‌ సోషల్‌లో పాకిస్తాన్‌లో ‘విస్తారమైన చమురు నిల్వల‘ అభివృద్ధికి అమెరికా సహకరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఒప్పందం కోసం ఒక చమురు కంపెనీని ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే కాక, దక్షిణాసియా ఇంధన మార్కెట్‌లో ఆ దేశాన్ని బలోపేతం చేయవచ్చు’ అని వ్యాఖ్యానించాడు. ట్రంప్‌ వ్యాఖ్యల్లో ఆసక్తికర అంశం ఏమిటంటే, పాకిస్తాన్‌ భవిష్యత్తులో భారత్‌కు ఇంధనం విక్రయించే అవకాశం ఉందని సూచించడం. ఈ వ్యాఖ్య భారత్‌–పాకిస్తాన్‌ సంబంధాల సంక్లిష్టత మరింత పెంచుతుంది. భారత్, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇలాంటి వాణిజ్య సహకారం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

భారత్‌పై సుంకాల మోత..
ట్రంప్‌ ఓ పిచ్చోడు.. ఇది ఎవరూ కాదనలేని నిజం. ఎందుకంటే ట్రంప్‌ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇటు అమెరికన్లతోపాటు, అమెరికాలోని విదేశీయులను టెన్షన్‌ పెడుతున్నాయి. ఇక సుంకాల పేరుతో ప్రపంచ దేశాలను భయపెడుతున్నారు. తాజాగా భారత్‌పై 25 శాతం సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిని ప్రతీకార సుంకాలుగా పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించారు. ఈ నిర్ణయం ఫార్మాస్యూటికల్స్, ఉక్కు, అల్యూమినియం, టెక్స్‌టైల్స్‌ వంటి రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు కేంద్రం కూడా ప్రతీకార సుంకాలను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషిస్తోంది. ఈ తరుణంలో ట్రంప్‌ తీసుకున్న పాకిస్తాన్‌ అనుకూల నిర్ణయం.. భారత్‌–పాకిస్తాన్‌ సంబంధాలపై కొత్త ఒత్తిడిని తీసుకొస్తుంది. భారత్, పాకిస్తాన్‌ మధ్య ఇటీవలి ఉద్రిక్తతలు, ముఖ్యంగా జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత ‘ఆపరేషన్‌ సిందూర్‌‘ వంటి సైనిక చర్యలు, ద్వైపాక్షిక సంబంధాలను మరింత దిగజార్చాయి. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్‌తో అమెరికా చమురు ఒప్పందం భారత్‌కు భౌగోళిక–రాజకీయ సవాల్‌గా మారే అవకాశం ఉంది.

ఇంధన భద్రతపై ప్రభావం..
భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగదారు.. రెండో అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారు. చమురు ధరలలో ఒక డాలర్‌ పెరుగుదల కూడా భారత ఆర్థిక వ్యవస్థపై వేల కోట్ల రూపాయల భారం వేస్తుంది. పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు ఇంధన సరఫరా అనే ట్రంప్‌ ప్రకటన ఆచరణలో అంత ఈజీ కాదు. భారత్‌ ఇప్పటికే వెనిజులాలా, రష్యా వంటి దేశాల నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తోంది. అయితే, వెనిజులాతో వాణిజ్యం చేసే దేశాలపై ట్రంప్‌ 25% సుంకాలు విధిస్తామని హెచ్చరించడం భారత్‌కు కొత్త సవాలుగా మారింది.

Also Read: పేరూ లేదు.. ఊరూ లేదు..67,000 కోట్లు..అందులో మీవేవైనా ఉన్నాయా?

ట్రంప్‌ ప్రతీకార సుంకాలు, పాకిస్తాన్‌తో ఒప్పందం భారత్‌కు ఆర్థిక, రాజకీయ సవాళ్లను తీసుకొస్తున్నాయి. అయినా భారత ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలను రక్షించుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేయడం, ఆసియాన్, యూరోపియన్‌ యూనియన్‌ వంటి మార్కెట్లను అన్వేషిస్తోంది.

Exit mobile version