Tirupati Woman VRO case: అతడు ఉన్నత చదువులు చదివాడు.. పోటీ పరీక్షలు రాసి ఏకంగా ఎమ్మార్వో అయ్యాడు. మండలానికి మెజిస్ట్రేట్ గా కొనసాగుతున్నాడు. అటువంటి వ్యక్తి బాధ్యతగా ఉండాలి. వివిధ సమస్యలపై తన వద్దకు వచ్చే వారికి పరిష్కారాన్ని చూపించాలి. ఒక అధికారిగా అది అతని బాధ్యత. ఆ బాధ్యతను అతడు గాలికి వదిలేసాడు. పైగా ఒక కిందిస్థాయి మహిళా ఉద్యోగిపై కన్ను వేశాడు. అంతటితో ఆగలేదు. ఏకంగా ఇంటికి వెళ్ళాడు.. చేయకూడని పని చేసేందుకు యత్నించాడు. కానీ ఇంతలోనే ఆ అమ్మాయి అమ్మ రావడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.
Also Read: ఏపీ లిక్కర్ స్కాంలో దొరికిన ఆ 11 కోట్లు ఎవరివి?
తిరుపతి జిల్లాలో ఓ ఎమ్మార్వో ఓ వీఆర్వోను వేధిస్తున్నాడు. లైంగికంగా ఇబ్బంది పడుతున్నాడు. తన కోరిక తీర్చాలని.. కోరిక తీర్చితే ఏదైనా ఇస్తానని ఆమెకు ఆఫర్ కూడా ఇస్తున్నాడు. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆమె.. ఆ అధికారి చేష్టలను మౌనంగా భరించేది. ఎదురు తిరిగితే ఇబ్బంది పెడతాడేమోనని.. ఎక్కడికైనా బదిలీ చేస్తాడేమోనని భయపడిపోయేది. ఇదే అదునుగా ఎమ్మార్వో రెచ్చిపోయేవాడు. ” నీ వయసు.. నీ అందం.. నన్ను నిలువనీయకుండా చేస్తున్నాయి. ఏదైనా చేయాలనిపిస్తున్నాయి. త్వరగా ఆ పని కానిద్దాం. మీ ఇంటికి వస్తాను. నాటు కోడి తీసుకొస్తాను. కమ్మని కూర వండు. ఆ కూరను తింటూ నీ అందాన్ని జుర్రుకుంటాను” అంటూ ఆమెకు సందేశాలు పంపినట్టు సమాచారం. ఈ సందేశాలకు ఆమె దగ్గర నుంచి రిప్లై రాకపోవడంతో.. ఏకంగా ఆమె ఇంటికి వెళ్ళిపోయాడు ఆ ఎమ్మార్వో. తన దుస్తులు తొలగించి కోరిక తీర్చాలంటూ ఆమెను ఇబ్బంది పెట్టాడు.
Also Read: జగన్ కోసం అడవులు, కొండలు దాటి.. కోనలు దాటి.. వైరల్ వీడియోలు
ఇంటికి రావడం.. దుస్తులు తొలగించి తన ముందు అత్యంత దారుణంగా నిలబడటంతో.. ఆ యువతి తట్టుకోలేకపోయింది. ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. అదే సమయంలో ఆమె అక్కడికి వచ్చి ఆ ఎమ్మార్వోకి దేహ శుద్ధి చేసింది. చెప్పుతో చెంప దెబ్బలు కొట్టింది. ఆ తర్వాత ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ప్రస్తుతం ఆ ఎమ్మార్వో పోలీసులు అదుపులో ఉన్నాడు. ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. అయితే ఆ ఎమ్మార్వో ఇప్పుడు మాత్రమే కాదని.. గతంలో అనేక సందర్భాల్లో మహిళా ఉద్యోగులను ఇలానే నరకం చూపించాడని.. ఇబ్బంది పెట్టాడని సమాచారం. ఇతర పై శాఖపరమైన చర్యలు కూడా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఒక విఆర్వో విషయంలో చేయకూడని పని చేసిన ఎమ్మార్వో తన ఉద్యోగ జీవితాన్ని.. వ్యక్తిగత జీవితాన్ని బజారుపాలు చేసుకున్నాడు.