Peddireddy Liquor Scam Case: మద్యం కుంభకోణం( liquor scam ) కేసులో అరెస్టయ్యారు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి. కొద్దిరోజుల కిందట అరెస్ట్ అయిన ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆగస్టు 1న ఆయన కేసు మరోసారి విచారణకు రానుంది. అయితే మిధున్ రెడ్డికి ఇంటి భోజనంతో పాటు కొన్నిరకాల సౌకర్యాల విషయంలో కోర్టు మినహాయింపు ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రిలోనే ఉంటున్నారు. అక్కడే ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఇంటి భోజనం కుమారుడి కోసం పంపిస్తున్నారు. అయితే కుమారుడు మిథున్ రెడ్డి కోసం ఆ వయసులో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిత్యం జైలుకు వెళ్లి వస్తున్నారు. అయితే మొన్న ఆ మధ్యన జైలుకు దిండు తో పాటు ఇతర సామాగ్రిని తీసుకెళ్లే క్రమంలో పెద్దిరెడ్డి గన్మెన్ సహకరించాడు. అందుకు బాధ్యుడిని చేస్తూ పోలీస్ శాఖ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో పెద్దిరెడ్డి అంటేనే పోలీసులు హడలెత్తిపోతున్నారు.
Also Read: లిక్కర్ స్కాంలో భారతీ రెడ్డి పేరు!?.. జగన్ కు షాక్!
హడలెత్తుతున్న పోలీసులు..
వాస్తవానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( peddi Reddy Ramachandra Reddy ) ఈ రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరించారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అటువంటి నేత విషయంలో పోలీసులు గౌరవంగానే వ్యవహరిస్తారు. కానీ మొన్న గన్మెన్ సస్పెన్షన్ తో భయపడిపోతున్నారు. తాజాగా ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలు ప్రాంగణంలోకి వచ్చారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన కోసం ఓ పోలీస్ కానిస్టేబుల్ కుర్చీ తీసుకొచ్చి వేశాడు. ఇంతలోనే ఒక పోలీసు ఉన్నతాధికారి వచ్చి ఆ కుర్చీని తొలగించమని సూచించాడు. పెద్దిరెడ్డి దగ్గరగా వెళ్లి.. ఉన్నత స్థాయిలో ఆదేశాలు ఉన్నాయని.. అందుకే కుర్చీ వేయలేదని చెప్పుకొచ్చాడు. దీంతో పెద్దిరెడ్డి తీవ్ర అసహనంతో కనిపించడం ఆ వీడియోలో కనిపిస్తోంది.
Also Read: ఇలాంటి పనులతో జగన్ బిజీ అవుతాడనుకోలేదు!
చంద్రబాబుతో వైరం..
అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో ఒక హవాను కొనసాగించారు. రాయలసీమ మొత్తం ఆయన కనుల్లో ఉండేది. ముఖ్యంగా చంద్రబాబుతో చిరకాల వైరం ఉంది. అప్పట్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును ఓడిస్తానని శపధం చేశారు కూడా. ఒకానొక దశలో కుప్పం వచ్చిన చంద్రబాబుపై వైసిపి శ్రేణులతో దాడి చేయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో అవన్నీ మనసులో పెట్టుకొని చంద్రబాబు ఇలా పెద్దిరెడ్డి పై ఓ రేంజ్ లో రివేంజ్ తీర్చుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయమైన కుటుంబం పెద్దిరెడ్డి. మరి అటువంటి అప్పుడు చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.