Pallavi Prashanth Latest Interview: పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth)..అంత తేలికగా మర్చిపోయే పేరు కాదు ఇది. ఒకప్పుడు సోషల్ మీడియా లో రైతు బిడ్డగా ఎన్నో ట్రోల్స్ ని ఎదురుకున్నాడు. ఇతను చేసిన వీడియోలను చూస్తే ‘ఎవరు ఇతను..ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు’ అని అనుకోక తప్పదు. అయితే ఇతనికి బిగ్ బాస్ లోకి ఎలా అయినా వెళ్లాలనే కోరిక అప్పట్లో ఉండేది. దేవుడు కరుణించాడు, బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టే అద్భుతమైన అవకాశం మాత్రమే కాదు, హౌస్ లోపల అద్భుతంగా గేమ్స్ ఆడి, సీజన్ 8 టైటిల్ విన్నర్ గా బయటకి వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అతను జైలుకి వెళ్లడం, జైలు నుండి తిరిగి రాగానే ఇంటర్వ్యూస్ కోసం వచ్చిన వాళ్ళని వెనక్కి పంపడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే జరిగాయి. అయితే పల్లవి ప్రశాంత్ చాలా కాలం తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు.
జబర్దస్త్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘కిస్సిక్ టాక్స్’ అనే షోలో ఈ వారం అతిథి గా పాల్గొన్న పల్లవి ప్రశాంత్, ఈ ఇంటర్వ్యూ లో తనకు జరిగిన ప్రతీ సంఘటనను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతకూ ఆయన ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం. యాంకర్ వర్ష ఒక ప్రశ్న అడుగుతూ ‘ప్రశాంత్ బిగ్ బాస్ తర్వాత ఇంత గ్యాప్ తీసుకున్నావంటే, కచ్చితంగా ఎదో పెద్దది ప్లాన్ చేశావు కదా’ అని అడుగుతుంది. దానికి ప్రశాంత్ సమాధానం చెప్తూ ‘అవును.. అంతకు మించి పెద్ద ప్లానింగ్ తోనే ఉన్నాను’ అని చెప్పుకొచ్చాడు.
Read Also: ‘కింగ్డమ్’ సెంటిమెంట్ సీన్స్ కి నవ్వుతున్నారు భయ్యా..ఇలా అయి
మీ దగ్గర ఉన్న చిన్న ఫోన్ తో వీడియోలు చేసి, అంత దూరం వెళ్తానని ఎలా అనుకున్నారు అని వర్ష అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ‘మా నాన్న దగ్గరకు ఒక పెద్ద మనిషి వచ్చి, నీ కొడుకు ఏమి చేస్తున్నాడు అని అడిగాడు. మా నాన్న పొలం పనులు చేస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి నన్ను తీసి పారేసినట్టు మాట్లాడాడు. నాకు చాలా బాధగా అనిపించింది’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత అమర్ డీప్ కారు పై జరిగిన దాడి గురించి మాట్లాడుతూ ‘ అది ఎవరు చేసినారో ఆ దేవుడికే తెలియాలి. కానీ కర్మ అనేది ఒకటి కచ్చితంగా ఉంటుంది. అది గట్టిగా ఎదో ఒక రోజు తగులుతుంది’ అని అంటాడు. అమర్ డీప్ తో ప్రస్తుతం మీ రిలేషన్ ఎలా ఉంది అని అడిగిన ప్రశ్న కి సమాధానం చెప్తూ ‘అమర్ అన్నా..హౌస్ లోపల జరిగిన వాటిని..బయటకి వచ్చిన తర్వాత జరిగిన వాటిని పూర్తి గా మర్చిపో.. ఆరోజు రాత్రి ఆ దాడి మీరే చేయించారని నేను, కాదు నువ్వే చేయించవని మీరు అన్నారు. అలా ఎదో జరిగిపోయింది. ఇక వదిలేయండి’ అంటూ చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది ప్రోమోలో చూడండి.