Mahesh Babu: పోకిరీ తీసి పూరి నమ్మలేదు.. కృష్ణ ముందే చెప్పాడు…

Mahesh Babu Pokiri: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో భారీ సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు అందులో మహేష్ బాబు ఒకరు. ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేశాయి. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన పోకిరి సినిమా పెను సంచలనాలను క్రియేట్ చేసిన విషయం మనకు తెలిసిందే. మహేష్ బాబు కెరియర్ లో మొదటి ఇండస్ట్రీ హిట్ నమోదు చేసిన సినిమా కూడా ఇదే కావడం విశేషం…పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడు ఈ సినిమాని తీసిన తర్వాత ఈ సినిమా హిట్ అవుతుంది అనుకున్నాడు తప్ప ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే అంత హిట్ అవుతుందని తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయారట. సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ఈ సినిమాని చూసిన సూపర్ స్టార్ కృష్ణ మీద ముందుగానే గెస్ చేసి ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తుందని చెప్పడంతో పూరి జగన్నాథ్ సైతం ఆశ్చర్యపోయి మీ కొడుకు హీరోగా చేస్తున్నాడు కాబట్టి మీరు అలా చెప్పడంలో తప్పులేదు అని అన్నాడట. కానీ కృష్ణ మాత్రం లేదు సినిమాలో అంత కంటెంట్ ఉంది అని చెప్పాడు. అప్పటికే 350 సినిమాల్లో హీరోగా నటించిన కృష్ణ చాలా సినిమాలను డైరెక్షన్ కూడా చేశాడు. ఆయన అనుభవాన్ని కలగలిపి ఆయన చెప్పిన మాటలు అక్షర సత్యాలుగా నిలిచాయి.

Also Read: ముందే రివీల్.. కింగ్డమ్ విషయంలో గౌతమ్ తిన్ననూరి చేసిన తప్పు అదేనా..?

సినిమా రిలీజ్ అయి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయడమే కాకుండా అప్పటివరకు మహేష్ బాబు తరంలో ఉన్న ఏ నటుడు సాధించినటువంటి గొప్ప ఘన కీర్తిని కూడా మహేష్ బాబు అందుకోవడం విశేషం… పోకిరి సినిమాకి ముందు ఆయన చేసిన అతడు సినిమాలో సాఫ్ట్ లుక్ లో కనిపించిన మహేష్ బాబు ఈ సినిమాలో ఫుల్ మాస్ క్యారెక్టర్ ని పోషించి మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

అప్పటి నుంచి ఇప్పటివరకు మాస్ లో ఆయనకు చాలా మంచి పట్టు ఉందనే చెప్పాలి… డైరెక్టర్ పూరి జగన్నాథ్ సైతం ఇదేదో ఫ్లూక్ లో సక్సెస్ అయిన సినిమా తప్ప దీని మీద నేను స్పెషల్ కేర్ అయితే తీసుకోలేదు అని ఆయన చాలా సందర్భాల్లో తెలియజేశాడు. మొత్తానికైతే ఈ సినిమా పూరి జగన్నాథ్ మహేష్ బాబు కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పూరి జగన్నాథ్ ఈ సినిమా తర్వాత అంతటి బ్లాక్ బస్టర్ సక్సెస్ ను మరోసారి దక్కించుకోకపోవడం అతని అభిమానులను కొంతవరకు నిరాశ పరుస్తుందనే చెప్పాలి.

Also Read: కింగ్డమ్’ మూవీ ట్విట్టర్ రివ్యూస్ వచ్చేశాయి..సినిమా ఎలా ఉందంటే!

ఇక ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలు అసలు సక్సెస్ లను సాధించకపోవడం ఒకటైతే, ఆయన సినిమాల మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయకపోవడం మరొకటి వీటి వల్లే ఆయన చేసిన సినిమాలు సక్సెస్ లు సాధించడం లేదు…మరి ఇకమీదటైనా మంచి సక్సెస్ లను సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

Leave a Comment