Site icon Desha Disha

Kingdom Part 2 Update: కింగ్డమ్ పార్ట్ 2 లో మురుగన్ అన్న

Kingdom Part 2 Update: కింగ్డమ్ పార్ట్ 2 లో మురుగన్ అన్న

Kingdom Part 2 Update: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. తెలుగు సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తు ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇక తెలుగు సినిమాల విషయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో వచ్చే ప్రతి సినిమా ఇండియాలో మంచి విజయాన్ని సాధించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగడానికి కారణం అవుతున్నాయి. ఇక ఈరోజు విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘కింగ్డమ్’ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమాకి సెకండ్ పార్ట్ ఉందని సినిమా చివర్లో అనౌన్స్ చేశారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సెకండ్ పార్ట్ లో విజయ్ దేవరకొండ ఆ తెగ ప్రజల దగ్గర దాచిన రహస్యం తెలిస్తే ఆ ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు…అలాగే విలన్ మురుగన్ అన్న విజయ్ మీద ఎలా పగ తీర్చుకోబోతున్నాడు అనేదాన్ని బేస్ చేసుకొని ఈ సినిమా కథ ఉండబోతోంది… అయితే మురుగన్ అన్న ఎవరు అనేది రివిల్ చేయలేదు. కానీ ఆ క్యారెక్టర్ లో ఒక పవర్ఫుల్ నటుడు నటించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి…

Also Read: కింగ్డమ్ లో విజయ్ దేవరకొండ కాకుండా ఆ స్టార్ హీరో చేసి ఉంటే బాగుండేదా..?

ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆ పాత్రలో తమిళ నటుడు అయిన ఆది పినిశెట్టి నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆయన మీద కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారట. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాను సైతం వచ్చే సంవత్సరం రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇక మొదటి పార్ట్ కి మంచి రెస్పాన్స్ రావడంతో రెండో పార్ట్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఆ సినిమాను తెరకెక్కిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇప్పటికే ఆది పినిశెట్టి పలు సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు.

Also Read: ‘కింగ్ డమ్’ పబ్లిక్ టాక్ : మూవీలో అదే మైనస్ అంట..

ముఖ్యంగా సరైనోడు, రంగస్థలం సినిమాలో ఆయన నటనకు చాలా మంచి గుర్తింపైతే లభించింది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో తలబడబోతున్నాడు. ఇక వీళ్ళిద్దరి మధ్య ఒక భారీ ఫైట్ ఉండబోతుందట. మరి ఆ ఫైట్ లో అది పినిశెట్టి ని విజయ్ ఎలా ఎదుర్కొంటాడు.ఈ ఇద్దరు తలపడితే ఎలా ఉంటుంది అనే ధోరణిలో ఇప్పటినుంచే అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు. మరి ఏది ఏమైనా కూడా మొదటి పార్ట్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి సెకండ్ పార్ట్ కూడా అదే రిజల్ట్ ని అందుకుంటుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Exit mobile version