KCR Strategy Talks: ప్రస్తుతం రాష్ట్రంలో వేడి వేడిగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంగళవారం ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు కీలక భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా రాజకీయ పరిణామాలపై వీరిమధ్య సుదీర్ఘమైన చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. ప్రధానంగా మూడు అంశాలతో పాటు మరికొన్ని అంశాలపై వీరు సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
బీసీ రిజర్వేషన్ పై..
బీసీ రిజర్వేషన్ కు సంబంధించి పార్టీ ఒక స్పష్టమైన విధానం అవలంభించాలని, వీటికి సంబంధించి ఇదివరకే అన్ని పార్టీలు తమ అనుకూలతను స్పష్టం చేశాయి. బీఆర్ఎస్ మాత్రం రిజర్వేషన్ బిల్లును శాసనసభలో మద్దతు పలికినా, ఒకవేళ బిల్లుకు రాష్ట్రపతి, ఆర్డినెన్స్ పై గవర్నర్ ఆమోదం ముద్ర వేయకున్నా, పార్టీ పరంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో, పార్టీ కూడా అదే విధానం అవలంభించకుంటే పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే విషయమై చేర్చినట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం
అలాగే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నందున, ఈ ఎన్నికలకు ఏవిధంగా శ్రేణులను సమాయత్తం చేయాలనే విషయంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కవితను జైలు నుంచి విడిపించేందుకు అవసరమైతే పార్టీని, బీజేపీలో విలీనం చేయాలని అనుకున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టడం అనే అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: Telangana BC reservations: అందరి దృష్టి బీసీ రిజర్వేషన్లపైనే..
కవిత దూకుడుపై..
తెలంగాణ జాగృతి కార్యక్రమాలతో కవిత దూకుడు ప్రదర్శిస్తున్న ఈ తరుణంలో పార్టీ ఏవిధంగా వ్యవహరించడం, కవిత కార్యకలాపాలతో పార్టీకి ఎంతవరకు లాభం, నష్టం అనే విషయాలపై కూడా చర్చ జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కొన్ని విషయాలపై కవిత పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్న తీరు కూడా పార్టీలో చర్చ జరుతున్న సందర్భంగా కేసీఆర్ ఏవిధంగా స్పందించి నిర్ణయాలు తీసుకుంటారో ఈ భేటీలో నిర్ణయం జరుగుతుందని భావిస్తున్నారు.
త్వరలో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం..
స్థానిక ఎన్నికలకు సంబంధించి కార్యాచరణ రూపొందించేందుకు వీలుగా త్వరలో పార్టీ ప్రధాన నాయకులతో పాటు మండల, జిల్లా స్థాయి నాయకులతో ఒక సమావేశం త్వరలో ఏర్పాటు చేసి, ఎన్నికల సందర్భంగా పార్టీ శ్రేణులకు కేసీఆర్ దశదిశా నిర్దేశం చేసేందుకు తెలంగాణ భవన్ లో ఒక విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చెయ్యాలనే తలంపుతో ఉన్నట్లు తెలిసింది.