Site icon Desha Disha

Kavitha KTR Debate: కాక రేపుతున్న అన్నాచెల్లెళ్ల వేర్వేరు మీటింగ్స్!

Kavitha KTR Debate: కాక రేపుతున్న అన్నాచెల్లెళ్ల వేర్వేరు మీటింగ్స్!

Kavitha KTR Debate: మొన్నటిదాకా భారత రాష్ట్ర సమితి ఒక గొడుగు నీడలో ఉండేది. ఆ గొడుగు కేసీఆర్ కంట్రోల్ లో ఉండేది.. క్రమేపి పార్టీలో పెత్తనం కేటీఆర్ చేతుల్లోకి వెళుతున్నా కొద్దీ పరిస్థితి మారిపోతున్నది. ఏం జరుగుతుందో భారత రాష్ట్ర సమితి బయట పెట్టకపోయినప్పటికీ.. నేతలు వేస్తున్న అడుగులు.. మాట్లాడుతున్న మాటలు పార్టీలో పరిస్థితిని బయటకి తెలియజేస్తున్నాయి.. ఒకప్పుడు పకడ్బందీగా.. సమర్థవంతంగా.. క్రమశిక్షణాయుతంగా కనిపించిన భారత రాష్ట్రపతి క్రమేపి ఎవరికివారు అన్నట్టుగా మారిపోతున్నట్టు ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Also Read: అతడు సినిమా రీ రిలీజ్.. ఎన్ని డబ్బులొచ్చినా ఆ ఫౌండేషన్ కే…

లిక్కర్ కుంభకోణం లో అభియోగాలు ఎదుర్కొని.. కొద్దిరోజుల పాటు జైలు శిక్ష అనుభవించి.. విడుదలైన కల్వకుంట్ల కవిత తన రాజకీయ ప్రయాణాన్ని మరోవైపు మళ్ళించారు. భారత రాష్ట్ర సమితిలో చోటుచేసుకుంటున్న అంతర్గత మార్పులపై ఆమె బహిరంగంగానే చెబుతున్నారు. పార్టీ అధినేత ఆదేశాల మేరకు నడుచుకుంటానని చెబుతున్న ఆమె.. తన సొంత రాజకీయ క్షేత్రాన్ని ఏర్పరచుకుంటున్నారు. గతంలో తమ స్థాపించిన జాగృతి సంస్థను మళ్ళీ యాక్టివ్ చేశారు.. రాష్ట్ర ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారు. ఇటీవల బీసీ ఉద్యమాన్ని ఆమె నెత్తికెత్తుకున్నారు.. ఆ తర్వాత వివిధ అంశాలపై తనదైన స్పందనను తెలియజేస్తున్నారు. పార్టీ అనుకున్న మీడియాలో తనకు ప్రచారం లభించకపోయినప్పటికీ.. మనకు ఉన్న వనరులతోనే కల్వకుంట్ల కవిత ప్రచారాన్ని సాగించుకుంటున్నారు.. జాగృతి ఆధ్వర్యంలో లీడర్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఆయా జిల్లాలలో తన సొంత కార్యవర్గాన్ని బలోపేతం చేసుకున్న దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు.. లీడర్ కార్యక్రమంలో కవిత చేపట్టారు. వివిధ విశ్లేషకులు.. మేధావులతో ఆమె శిక్షణ కార్యక్రమాన్ని సాగించారు. చివర్లో అనేక అంశాలను ప్రస్తావించిన ఆమె.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. బనక చర్ల నుంచి మొదలుపెడితే అంశాలపై కల్వకుంట్ల కవిత మాట్లాడారు.

భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా యువతరాన్ని ఆకర్షించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. పార్టీ అనుబంధంగా ఉండే విద్యార్థి విభాగ సదస్సులో కేటీఆర్ మాట్లాడారు.. ఇందులోనూ రేవంత్ ప్రభుత్వాన్ని విమర్శించడమే ప్రధాన లక్ష్యంగా కేటీఆర్ పెట్టుకున్నారు. ఇందులో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కవిత మాదిరిగానే కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం విశేషం. అటు సోదరి, ఇటు సోదరుడు వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహించడం.. ఇద్దరు కూడా ప్రభుత్వాన్ని విమర్శించడం విశేషం. అన్నా చెల్లెళ్లు వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహించడంతో పార్టీలో సాగుతున్న అంతర్గత పోరును బయటపెట్టిందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే కల్వకుంట్ల కవితను కెసిఆర్ కుటుంబం దూరం పెట్టిందని వార్తలు వస్తున్నాయి. ఇటీవలి పరిణామాలు కూడా వాటికి బలం చేకూర్చుతున్నాయి.

Also Read: ఫ్రస్టేషన్ లో జనసేన ఎమ్మెల్యేలు..’సర్దుకుపోవడం’ పై అసంతృప్తి!

ఇటీవల టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలి హోదా నుంచి కల్వకుంట్ల కవితను తప్పించి.. ఆస్థానంలో కొప్పుల ఈశ్వర్ ను భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు నియమించారు. అయితే ఈ నియామకాన్ని కల్వకుంట్ల కవిత తప్పు పట్టలేదు. పైగా ఈశ్వర్ కార్మిక సంఘ నాయకుడని పేర్కొంది.. వాస్తవానికి కవిత నుంచి కేటీఆర్ ఈ స్పందన ఊహించినట్టున్నారు. పార్టీ నుంచి తనకు వ్యతిరేకంగా తీసుకుంటున్న ఏ నిర్ణయాన్ని కూడా కవిత తప్పు పట్టడం లేదు. పైగా అందులో కూడా ఆమె సానుకూలతను స్వీకరిస్తున్నారు. పోటాపోటీగా అన్నా చెల్లెళ్లు తమ రాజకీయ క్షేత్రాలను స్థిరం చేసుకుంటున్న క్రమంలో.. తదుపరి దశలో ఎటువంటి అడుగులు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version