Jagan Key Decision: 29న జగన్ కీలక నిర్ణయం

Jagan Key Decision: జగన్( Y S Jagan Mohan Reddy) ఒక నిర్ణయానికి వచ్చారా? తన అరెస్టు తప్పదని భావిస్తున్నారా? తదుపరి కార్యాచరణను సిద్ధం చేశారా? అందులో భాగంగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నారా? పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 30 మందితో కూడిన జంబో కమిటీని ఏర్పాటు చేసి పార్టీని మరింత విస్తరించారు జగన్మోహన్ రెడ్డి. సీనియర్లతో పాటు జూనియర్లకు ఆ కమిటీలో చోటు ఇచ్చారు. ఇప్పుడు ఆ కమిటీ పనితీరుపైనే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ మేరకు పొలిటికల్ అడ్వైజరి కమిటీ సమావేశాన్ని ఈనెల 29న నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Also Read: జగన్ ఢిల్లీ బాట.. ఏంటి కథ?

* నామమాత్రంగా కమిటీ..
వాస్తవానికి వైసీపీ( YSR Congress party ) ఏర్పాటు చేసిన తర్వాత ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని కూడా సమాంతరంగా ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీకి పోలిట్ బ్యూరో మాదిరిగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీని తీర్చిదిద్దాలని భావించారు. అయితే ఎందుకో జగన్మోహన్ రెడ్డి ఈ కమిటీ పట్ల అంత సుముఖంగా లేరని అప్పట్లో అర్థమైంది. సమావేశాలు నిర్వహించడం కానీ.. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయడం కానీ ఎన్నడూ చేయలేదు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి.. పొలిటికల్ అడ్వైజరి కమిటీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రతి జిల్లాకు ఇద్దరు చొప్పున నాయకులను ఈ కమిటీలోకి తీసుకున్నారు. ఈనెల 29న వారితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుందని ప్రచారం నడుస్తోంది. ఒకవేళ తాను అరెస్టు అయితే ఎలా వ్యవహరించాలి అనేది ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో చెప్పనున్నారు అధినేత జగన్మోహన్ రెడ్డి.

* జగన్ అరెస్టు తప్పదా?
ఆగస్టు మొదటి వారంలో( August 1st week ) జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మద్యం కుంభకోణంలో ఇప్పటికే 12 మంది అరెస్టు అయ్యారు. రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి మొన్ననే అరెస్ట్ అయ్యారు. దీంతో తదుపరి అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి ది అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కీలక నేతలంతా కేసులతో ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి సమయంలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పైనే ఆశలు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఇతర పార్టీలు మద్దతు తెలిపే అవకాశం లేదు. జాతీయస్థాయిలో బిజెపి వ్యతిరేక పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డిని దగ్గర చేర్చుకోవడం లేదు. అందుకే ఇప్పుడు పొలిటికల్ అడ్వైజరీ కమిటీకి కీలక బాధ్యతలు అప్పగించేందుకు జగన్ సిద్ధపడుతున్నారు.

* అత్యున్నతంగా పొలిట్ బ్యూరో
అయితే తెలుగుదేశం పార్టీకి( Telugu Desam Party ) పోలిట్ బ్యూరో ఉంది. ఇది పార్టీలో అత్యంత కీలకమైన విభాగం. అధినేత చంద్రబాబు పార్టీ పరంగా, విధానపరంగా తీసుకునే నిర్ణయాలపై ఈ కమిటీ సమావేశంలోనే చర్చిస్తారు. టిడిపి అధికారంలో ఉన్నా.. లేకపోయినా పొలిట్ బ్యూరో సమావేశం అనేది నిత్యం జరుపుతుంటారు. ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలపై ఈ కమిటీలో చర్చిస్తారు. ప్రజా పోరాటాల పై కార్యాచరణ రూపొందిస్తారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమానికి తీసుకోవాల్సిన నిర్ణయాలపై కూడా ఇదే సమావేశంలో కార్యాచరణ సిద్ధం చేస్తారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మాత్రం నామ మాత్రమే అన్న చర్చ ఉండేది. అందుకే దానిని విస్తృతం చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే తాజా సమావేశంలో కీలక ఆదేశాలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

Leave a Comment