Site icon Desha Disha

ENG vs IND, 5th Test: వర్షం అడ్డంకి.. భారత్‌ 72/2

ENG vs IND, 5th Test: వర్షం అడ్డంకి.. భారత్‌ 72/2

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఐదో టెస్టుకు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో 23 ఓవర్‌ వద్ద అంపైర్‌లు లంచ్‌ బ్రేక్‌కు పిలుపునిచ్చారు. కాగా ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఓలీ పోప్‌.. బౌలింగ్‌ ఎంచుకున్నాడు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన గిల్‌ సేనకు ఆదిలోనే గట్టి షాక్‌ తగిలింది. జట్టు స్కోరు 10 పరుగుల వద్ద ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (2) పెవిలియన్‌ చేరాడు. కేవలం రెండు రన్స్‌ చేసి, అట్కిన్‌సన్‌ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. పదహారో ఓవర్‌ మొదటి బంతికే టీమిండియా రెండో వికెట్‌ కూడా కోల్పోయింది. వోక్స్‌ బౌలింగ్‌లో మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (14) బౌల్డ్‌ అయ్యాడు. 23 ఓవర్ల ఆట ముగిసే సరికి సాయి సుద్శన్‌ 25, కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ 15 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా స్కోరు: 72/2గా ఉంది.

ఈ మ్యాచ్‌కు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్ స్టోక్స్ దూరం అయ్యాడు. నాలుగో టెస్టులో గాయ‌ప‌డిన‌ అత‌ని స్థానంలో ఓలీ పోప్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు స్వీక‌రించాడు. ఈ మ్యాచ్‌లో భార‌త‌ జ‌ట్టు నాలుగు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. గాయ‌ప‌డ్డ రిష‌బ్ పంత్ స్థానంలో వికెట్ కీప‌ర్‌గా ధ్రువ్ జురెల్‌ను తీసుకున్నారు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో క‌రుణ్ నాయ‌ర్, బుమ్రా స్థానంలో ప్ర‌సిద్ధ్‌ కృష్ణను తీసుకున్నారు. అలాగే అన్షుల్‌ కాంబోజ్ స్థానంలో ఆకాశ్ దీప్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. అటు, ఇంగ్లండ్ జ‌ట్టులో కూడా మార్పులు జ‌రిగాయి. గ‌స్ అట్కిన్‌స‌న్‌, జేమీ ఓవ‌ర్ట‌న్‌, జోష్ టంగ్‌లు జ‌ట్టులోకి చేరారు.

The post ENG vs IND, 5th Test: వర్షం అడ్డంకి.. భారత్‌ 72/2 appeared first on Navatelangana.

Exit mobile version