CM Chandrababu Vs Ashok gajapati Raju: తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ అశోక్ గజపతిరాజు( Ashok gajapati Raju ). ఆయన సీనియారిటీతోపాటు సిన్సియారిటీ ని గుర్తించి గవర్నర్ పోస్ట్ లభించింది. మొన్ననే ఆయన గోవా గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ ద్వారా ఎన్నో పదవులు పొందిన ఆయన చంద్రబాబు నాయకత్వంలో పనిచేశారు. అటువంటి అశోక్ గజపతిరాజు గురించి ఓ రహస్యాన్ని చంద్రబాబు బయటపెట్టారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఒక బృందం సింగపూర్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీకి పెట్టుబడులు ఆహ్వానించే ప్రయత్నంలో భాగంగా సింగపూర్ లో పర్యటిస్తోంది చంద్రబాబు బృందం. అక్కడి తెలుగు వారితో పాటు దిగ్గజ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సైతం ప్రత్యేకంగా భేటీలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా తెలుగువారితో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇదే క్రమంలో అశోక్ గజపతిరాజు గురించి ప్రస్తావన కూడా తెచ్చారు.
Also Read: నేడు హైకోర్టు ముందుకు పవన్ కేసు!
అలా ఆయన ప్రస్తావన..
సింగపూర్ లో( Singapore) నిబంధనలు కఠినంగా ఉంటాయి. వాటిని ఉల్లంఘిస్తే అదే స్థాయిలో చర్యలు తీసుకుంటారు. అందుకే అక్కడ క్రమశిక్షణ కూడా ఉంటుంది. ఈ నిబంధనల గురించి ప్రస్తావించే సమయంలో అశోక్ గజపతిరాజు గురించి గుర్తు చేసుకున్నారు చంద్రబాబు. గతంలో చంద్రబాబు క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉండేవారు అశోక్ గజపతిరాజు. సీఎం చంద్రబాబు తో పాటు అశోక్ కూడా సింగపూర్ వెళ్లాల్సి వచ్చింది. అయితే అశోక్ గజపతి రాజుకు సిగరెట్ తాగే అలవాటు ఉండేది. చైన్ స్మోకర్ కూడా. పొగ తాగకుండా ఉండలేరు. అలాంటి అశోక్ చంద్రబాబుతో కలిసి సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఓ నిబంధన ఆయనను పొగతాగకుండా చేసింది. సింగపూర్ లో పొగ తాగితే 500 డాలర్ల జరిమానా విధిస్తారు. ఆ నిబంధన తెలిసిన అశోక్గజపతిరాజు పొగ తాగకుండా ఉండిపోయారు. అప్పటి విషయాన్ని తెలుగు వారితో పంచుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అశోక్ గజపతి రాజుతో అలా సింగపూర్ సిగరెట్ స్మోకింగ్ మాన్పించిందని.. దట్ ఇస్ సింగపూర్ అంటూ చంద్రబాబు ప్రశంసించారు.
Also Read: AM Ratnam Reaction Ambati
భారీ జరీమానాలకు భయపడి..
మత్తు పదార్థాల వినియోగం వంటి వాటి విషయంలో సింగపూర్లో కఠిన ఆంక్షలు ఉంటాయి. కేసులు కూడా నమోదు చేస్తారు. జరిమానాలు భారీ స్థాయిలో ఉంటాయి. అయితే సింగపూర్ పర్యటన సమయంలో అశోక్ గజపతిరాజు వ్యక్తిగత ఖర్చు కోసం 500 డాలర్లు తీసుకొచ్చారట. ఒక్క సిగరెట్టు ఫైన్ కి అంత ఖర్చు చేస్తే.. మిగిలిన రోజుల్లో ఖర్చులకు డబ్బులు ఎలా అని అశోక్ గజపతిరాజు ఆలోచన చేశారట. అలా సింగపూర్లో ఉన్నన్ని రోజులు అశోక్ గజపతిరాజు సిగిరెట్ మానేశారట. ఆ విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు( AP CM Chandrababu) చట్టాలను అమలు చేయడంలో ఎంతో మంచి పేరు సింగపూర్ కు ఉందని చెప్పారు. ఎంత మాత్రం అవినీతికి ఆస్కారం ఉండని దేశం కూడా ఇదేనని చెప్పుకొచ్చారు. అందుకే తనకు సింగపూర్ అంటే అభిమానమని తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రస్తుతం చంద్రబాబు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.