BAPS: బీఏపీఎస్ డా. జ్ఞానవత్సలదాస్ స్వామికి అమెరికాలో విశేష గౌరవం – Telugu News | BAPS Saint Dr Gnanvatsaldas Swami Honoured Across the United States for Exceptional Spiritual and Social Contributions

ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక, సామాజిక సేవలతో ఎంతో పేరు పొందిన బీఏపీఎస్ స్వామినారాయణ సంస్థ సన్యాసి, ప్రసిద్ధ మోటివేషన్ స్పీకర్  డా. జ్ఞానవత్సలదాస్ స్వామికి, ఆయన అమెరికాలో చేసిన ఆధ్యాత్మిక పర్యటన సందర్భంగా అమెరికా కాంగ్రెస్, పలు రాష్ట్ర ప్రభుత్వాలు, నగరాల మేయర్లు, ఓ ప్రముఖ యూనివర్శిటీ నుంచి గౌరవాలు లభించాయి. ఆయన ప్రవచనాలు, జీవన పాఠాలు ప్రజల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడమే కాకుండా, నైతిక విలువలు, మానవత్వాన్ని మన్నించేందుకు దోహదం చేశాయంటూ నేతలు ప్రశంసించారు.

Dr Gnanvatsaldas Swami

అమెరికాలో లభించిన ముఖ్య గౌరవాలు:

— అమెరికా ప్రతినిధుల సభ నుంచి గుర్తింపు పతకం. ఆధ్యాత్మికంగా ప్రజలను చైతన్యపరిచిన సేవలు అందించినందుకు సభ సభ్యుడు సుహాస్ సుబ్రమణ్యమ్ ఈ గుర్తింపును అందజేశారు.

— డెలావేర్ రాష్ట్రం – అధికార ప్రొక్లమేషన్: “ప్రజల వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలకు ఉపయుక్తమైన మార్గదర్శనం ఇచ్చినందుకు”.. గవర్నర్ మాథ్యూ మేయర్ అందజేశారు.

–న్యూజెర్సీ రాష్ట్రం – గౌరవ ప్రొక్లమేషన్: మంచి విలువలకు గొప్ప ప్రాతినిధ్యం వహించినందుకు సెనేటర్ ప్యాట్రిక్ డైగ్నాన్ అందించారు.

–మాసచుసెట్స్ రాష్ట్రం – ప్రత్యేక గుర్తింపు: “సామాజిక ఐక్యత కోసం చేసిన సేవలు అందించినందుకు” స్పీకర్ రోనాల్డ్ మరియానో, ప్రతినిధి రాడ్నీ ఎలియట్‌లు కలసి ప్రశాంసా పత్రాన్ని అందజేశారు.

–వర్జీనియా సెనేట్ – ప్రశంస పత్రం: “సమాజం కోసం అంకితంగా చేసిన సేవలకు గుర్తింపుగా” సెనేటర్ కన్నన్ శ్రీనివాసన్ అందజేశారు

–వర్జీనియా సెనేట్ – ప్రత్యేక గౌరవం: “ప్రజల జీవితాల్లో మంచి మార్పులు తీసుకొచ్చేందుకు చూపిన కృషికి” సెనేటర్ డ్యానీ డిగ్స్ అందించారు

–లోవెల్ నగరం (మాసచుసెట్స్) – ప్రశంస పత్రం: “మాటల ద్వారా ప్రజల ఆలోచనలను ప్రభావితం చేసినందుకు ”మేయర్ డేనియల్ రోర్క్ అందించారు

–హ్యాంప్టన్ నగరం (వర్జీనియా) – గౌరవం: “ప్రపంచవ్యాప్తంగా మనసులను తాకే సందేశాలు” అందించినందుకు మేయర్ జేమ్స్ ఎ. గ్రే జూనియర్ అందజేశారు

–న్యూపోర్ట్ న్యూస్ నగరం – ప్రొక్లమేషన్: “ప్రజల జీవన శైలిని మెరుగుపర్చిన కృషికి” మేయర్ ఫిలిప్ జోన్స్ ఇచ్చారు.

–నార్ఫోక్ స్టేట్ యూనివర్శిటీ – ప్రత్యేక ప్రశంసా పత్రం: “చరిత్ర, నైతికత, ఆత్మవిశ్వాసంపై చేసిన ప్రసంగాలకు గుర్తింపుగా” వైస్ ప్రెసిడెంట్ క్లిఫర్డ్ పోర్టర్ జూనియర్ ఇచ్చిన అభినందన.

బీఏపీఎస్ స్వామినారాయణ సంస్థ విషయానికి వస్తే.. ఇది ఒక ఆధ్యాత్మిక, సేవా సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఇది లక్షలాది మంది జీవితాల్లో సానుకూల మార్పులకు దోహదం చేస్తోంది. మహాంత్ స్వామి మహారాజ్ మార్గదర్శకత్వంలో ఈ సంస్థ ఆధ్యాత్మికత, సాంస్కృతిక సేవలు, మానవతా కార్యక్రమాల ద్వారా సమాజానికి సేవలందిస్తోంది. డా. జ్ఞానవత్సలదాస్ స్వామికు లభించిన ఈ అంతర్జాతీయ గౌరవాలు, భారతీయ ఆధ్యాత్మికత ప్రపంచంలో ఎలా ప్రభావం చూపిస్తోందో మరోసారి చాటిచెప్పాయి.

Leave a Comment