AP Land Registration Scheme: రూ.100తో భూముల రిజిస్ట్రేషన్.. ఏపీ ప్రభుత్వం సంచలనం!

AP Land Registration Scheme: ఏపీ ప్రభుత్వం( AP government ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయాల్లోనే భూముల రిజిస్ట్రేషన్ కు నిర్ణయించింది. కేవలం రూ.100 కే భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయనుంది. కేవలం నామమాత్రపు ఫీజుతో వారసత్వ భూముల హక్కులను కల్పించనుంది ఏపీ కూటమి ప్రభుత్వం. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ నుంచి త్వరలోనే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు రానున్నాయి. సబ్ రిజిస్టార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం ఆస్తి విలువ 10 లక్షల రూపాయల లోపు ఉంటే వంద రూపాయలు.. ఆ పైవుంటే వెయ్యి రూపాయల స్టాంపు డ్యూటీ కింద ఫీజు వసూలు చేయనున్నారు. అయితే ఈ సౌకర్యం ఆస్తి యజమానులు మరణించిన అనంతరం వారసులకు సంక్రమించే ఆస్తులకు మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన అన్ని రకాల రిజిస్ట్రేషన్లు యధావిధిగా సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లోనే జరుగుతాయి.

Also Read : మంత్రివర్గంలోకి ఆ మహిళ ఎమ్మెల్సీ?!

 కార్యాలయాల చుట్టూ తిరగకుండా..
ఇప్పటివరకు తల్లిదండ్రులు మరణిస్తే వారసత్వంగా వచ్చే ఆస్తుల కోసం, వాటిపై హక్కుల కోసం వారసులు వ్యయ ప్రయాసలకు గురయ్యేవారు. తాసిల్దార్ కు ( tahsildar) దరఖాస్తు చేసుకునేందుకు,మ్యూటేషన్ కోసం పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. గత ఏడాది ఏకంగా 55 వేల ఫిర్యాదులు దీనిపై వచ్చాయి. అందుకే ఏపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా యజమానులు చనిపోతే.. వారి వారసులు భాగాలు చేసుకుని లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయంతో సచివాలయానికి వస్తే.. అక్కడ పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇలా రిజిస్ట్రేషన్ చేయడం వల్ల భూముల రికార్డుల్లో వివరాల నమోదు ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. వారసులకు ఈపాస్ బుక్ కూడా జారీ అవుతుంది. వారసులుగా ఉన్నవారి నుంచి ఈ కేవైసీ సైతం తీసుకుంటారు.

Also Read: ఏపీలో ఉచిత ‘బస్సు’ ప్రయాణం.. కీలక ప్రకటన

 డబ్బు ఖర్చు లేకుండా..
సాధారణంగా వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్( registration) విషయంలో పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు అయ్యేవి. అందుకే దీనిని సులభతరం చేయడం, విభాగాలను తగ్గించడం కోసం ఈ ప్రత్యేక చర్యలు చేపట్టింది కూటమి ప్రభుత్వం. అయితే ఆస్తి యజమాని మరణించిన తర్వాత వారసులకు సంక్రమించే ఆస్తులకు మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుంది. వారసత్వ ఆస్తులు తప్ప.. ఇతర ఆస్తి లావాదేవీలకు కొనుగోలు, అమ్మకం, గిఫ్ట్ డిడ్ మొదలైనవి సబ్ రిజిస్టార్ కార్యాలయంలోనే జరుగుతాయి. రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల ఉత్పన్నమయ్యే భూ వివాదాలు తగ్గించడం, తహసిల్దార్ కార్యాలయాల్లో జాప్యం, అవినీతిని నియంత్రించడం వంటి కారణాలతోనే ఈ కొత్త విధానాన్ని తెరపైకి తీసుకొస్తోంది కూటమి ప్రభుత్వం. దీనిపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

Leave a Comment