AP Free Bus Scheme Latest Update: ఏపీలో ఉచిత ‘బస్సు’ ప్రయాణం.. కీలక ప్రకటన

AP Free Bus Scheme Latest Update: మరో ఎన్నికల హామీ దిశగా కూటమి ప్రభుత్వం( Alliance government ) అడుగులు వేస్తోంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనుంది. ఇందుకు సంబంధించి సన్నాహాలు నిమగ్నం అయింది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే గత ఏడాదికాలంగా అదిగో ఇదిగో అంటూ పథకంపై ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికే పక్క రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతోంది. అక్కడ మంత్రులతో పాటు అధికారుల బృందం అధ్యయనం చేసింది. ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారం ఇప్పుడు పథకం అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయనుంది. అయితే పథకం అమలుపై ఏపీఎస్ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు కీలక ప్రకటన చేశారు.

Also Read: ఉద్యోగం కావాలంటే పడుకోవాలి.. వరుసగా రెచ్చిపోతున్న బాలయ్య అనుచరులు

ఏర్పాట్లలో ఏపీఎస్ఆర్టీసీ..
మహిళల ఉచిత ప్రయాణం( free travelling) పథకం అమలులోకి రానుండడంతో అందుకు సంబంధించి ఏర్పాట్లను నిమగ్నం అయ్యారు అధికారులు. ముఖ్యంగా రద్దీని దృష్టిలో పెట్టుకొని కొత్త బస్సులు సమకూర్చుకుంటున్నారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలకు కొత్తగా 1350 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 700 బస్సులు మంజూరు అయ్యాయి.. మరో 650 బస్సులను సమకూర్చుకునే పనిలో ఉన్నారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు కోసం ప్రస్తుతం ఉన్న 11వేల బస్సులలో.. 74% బస్సులను కేటాయిస్తున్నట్లు ఆర్టిసి ప్రకటించింది.

Also Read: ఏపీ ఎకానమీ మందగించిందా? వాస్తవమిదీ

 ఎండి ఫుల్ క్లారిటీ..
అయితే మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి అనేక రకాలుగా ప్రచారం నడుస్తోంది. ఏపీ మంత్రి ఒకరు భిన్న ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడినుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చని.. మంత్రి అచ్చెనాయుడు ప్రకటన చేశారు. అయితే తాజాగా దానిపై క్లారిటీ ఇచ్చారు ఏపీఎస్ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు( RTC MD Dwaraka Tirumala Rao ). కొత్త జిల్లాల వరకే ఉచిత ప్రయాణ పథకం అమలు చేయాలని భావించామని.. కానీ ఉమ్మడి జిల్లాల పరిధిలోకి విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు అయితే కొత్త జిల్లాల వరకే పథకం అమలు కాబోతున్నట్లు స్పష్టతనిచ్చారు ఆర్టీసీ. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ఉచితంగా అమలు చేయాలని మహిళలు కోరుతున్నారు. అయితే ఇప్పుడు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన అంటూ ఎండి ప్రకటన చేశారు. అయితే ఆగస్టు 15 నుంచి ముందుగా కొత్త జిల్లాలతో ఈ పథకాన్ని ప్రారంభించి.. పాత జిల్లాలకు విస్తరించబోతున్నట్లు స్పష్టమవుతోంది.

Leave a Comment