29 నుంచి ప్రో కబడ్డీ

విశాఖపట్నంలో తొలి దశ మ్యాచులు
హైదరాబాద్‌ :
ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకెఎల్‌) 12వ సీజన్‌ షెడ్యూల్‌ వచ్చేసింది. ఈ నెల 29న వైజాగ్‌లోని పోర్ట్‌ ఇండోర్‌ స్టేడియంలో ప్రో కబడ్డీ లీగ్‌ షురూ కానుంది. ఆరంభ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌, తమిళ్‌ తలైవాస్‌ తలపడనున్నాయి. లీగ్‌ దశ మ్యాచులకు వైజాగ్‌ సహా జైపూర్‌, చెన్నై, న్యూఢిల్లీ వేదికగా నిలువనున్నాయి. వైజాగ్‌లో 29 నుంచి సెప్టెంబర్‌ 11 వరకు.. జైపూర్‌లో సెప్టెంబర్‌ 12 నుంచి 28 వరకు.. చెన్నైలో సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ 12 వరకు.. న్యూఢిల్లీలో అక్టోబర్‌ 13 నుంచి 23 వరకు మ్యాచులు జరుగుతాయి. ఈ మేరకు లీగ్‌ దశలో 108 మ్యాచులకు నిర్వాహకులు షెడ్యూల్‌ విడుదల చేశారు. ప్లే ఆఫ్స్‌ షెడ్యూల్‌, వేదికను ఇంకా ఖరారు చేయలేదు. తెలుగు టైటాన్స్‌ ఈ సీజన్లో సొంత మైదానంగా హైదరాబాద్‌ స్థానంలో వైజాగ్‌ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సీజన్లో హైదరాబాద్‌లో ప్రో కబడ్డీ మ్యాచులు ఉండబోవు.

The post 29 నుంచి ప్రో కబడ్డీ appeared first on Navatelangana.

Leave a Comment