ముంబయిః ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన వివో నేడు తమ టీ సిరీస్‌లో తాజా మోడల్ అయిన వివో టీ4ఆర్ 5జీను విడుదల చేసింది. ఇది పరిశ్రమలోనే అత్యంత సన్నని క్వాడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లే కలిగిన స్మార్ట్ ఫోన్‌గా నిలిచింది. అలాగే ఇది ఐపీ68, ఐపీ69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్స్‌తో వస్తోంది. వివో టీ4ఆర్ 5జీ యూత్, అడ్వెంచర్ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిరది. వీరికి ఎటువంటి రాజీలేని, ఉత్తమమైన అనుభవాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది. ఈ ఫోన్‌కు శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఎస్‌ఓసీ ప్రాసెసర్ ఉంది. ఇది వేగవంతమైన పనితీరును అందిస్తుంది. ఫోన్‌లో 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్882 మెయిన్ కెమెరా, 32ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇవి రెండూ 4కే వీడియో రికార్డింగ్ కు మద్దతు ఇస్తాయి గుణాత్మకమైన వీడియోలు తీయడంలో చాలా ఉపయోగపడతాయి. ఫోన్‌లో 5700ఎంఏహెచ్ బ్యాటరీ, 44డబ్ల్యు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది, దీని వలన దీర్ఘకాలిక ఉపయోగం సాధ్యమవుతుంది. దీని ధర 8జీబీ ం 128జీబీ రూ.17,499, 8జీబీం256జీబీ రూ.19,499, 12జీబీం256జీబీ రూ.21,499.
