Kingdom Movie Review: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా నటించిన ‘కింగ్డమ్'(Kingdom Movie) చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై సోషల్ మీడియా లో మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వరుస ఫ్లాప్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ, మొత్తానికి ట్రాక్ లో పడ్డాడులే, ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు, టాలీవుడ్ లో స్థిరపడిపోయారు అని అంతా అనుకున్నారు. కానీ టాక్ కి తగ్గ ఓపెనింగ్స్ అయితే ఈ చిత్రానికి అసలు నమోదు అవ్వడం లేదు. టాక్ కూడా ఓవర్సీస్ కి, ఇండియా కి చాలా తేడా వచ్చేసింది. ప్రముఖ రివ్యూయర్స్ కూడా ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో నిజంగానే బాగుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఇండియా లో షోస్ మొదలయ్యాక అసలు టాక్ బయటపడింది.
Also Read: కింగ్ డం మూవీ.. అది లేదట.. దానికోసం చూసిన వారికి షాక్
ఫస్ట్ హాఫ్ కి ఇండియా లో కూడా అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం బాగా సాగదీశారని, స్లో స్క్రీన్ ప్లే అని, అసలు వర్కౌట్ అవ్వదు అని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. ఈ డివైడ్ టాక్ ప్రభావం ఓపెనింగ్స్ పై బలంగా చూపించింది. నైజాం, ఓవర్సీస్ ప్రాంతాల్లో విజయ్ దేవరకొండ బాగా స్ట్రాంగ్ కాబట్టి అక్కడ మాత్రం ఓపెనింగ్ వసూళ్లు బాగున్నాయి కానీ, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ప్రతీ సెంటర్ లోనూ ఈ చిత్రానికి చిల్లరే రాలుతుంది. స్పెషల్ షోస్ హౌస్ ఫుల్స్ అయ్యాయి కానీ, నూన్ షోస్ కి మాత్రం పెద్ద దెబ్బ పడింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ఈ చిత్రానికి ‘హిట్ 3’ కంటే తక్కువ ఓపెనింగ్స్ వస్తాయని అంటున్నారు. హిట్ 3 చిత్రానికి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 48 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
Also Read: ఒకే కారులో సమంత, రాజ్.. ఇవేమి పనులు బాబోయ్!
‘కింగ్డమ్’ చిత్రానికి ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే మొదటి రోజు 38 నుండి 40 కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయట. విజయ్ దేవరకొండ రేంజ్ కి ఇది మంచి ఓపెనింగ్ అనొచ్చు. కానీ ఈ సినిమాకు మొదటి నుండి ఉన్న హైప్ కి తక్కువ ఓపెనింగ్ అనాలి. నూన్ షోస్ పరిస్థితి అయితే ఇది, మ్యాట్నీస్ నుండి పికప్ అయితే కచ్చితంగా ఈ చిత్రం మరో 5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అదనంగా రాబట్టొచ్చు. ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ చిత్రానికి విడుదలకు ముందు రోజు 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక బుక్ మై షో యాప్ లో ప్రస్తుతానికి ఈ చిత్రానికి గంటకు 15 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇది పెరుగుతూ పోతే సినిమా ఓపెనింగ్స్ సాలిడ్ గా ఉంటాయి. లేదంటే అవుట్ అనుకోవచ్చు.