. ట్రంప్ నిరాధార ఆరోపణలపై ఖడ్గే నిలదీత
. ఆర్థిక వ్యవస్థ క్షీణతపై ఆందోళన
న్యూదిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై చేసే నిరాధార ఆరోపణలపై ప్రధాని మోదీ మౌన దీక్ష ఇంకెంత కాలం అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే ప్రశ్నించారు. పీఆర్ (ప్రచారం) గురించి కాకుండా దేశం గురించి ఆలోచించాలని మోదీ ప్రభుత్వానికి హితవు పలికారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని తెలియదా అంటూ నిలదీశారు. భారత ఆర్థిక వ్యవస్థను బీజేపీ పతనం చేసిందని ప్రపంచం మొత్తానికి తెలుసని ఎద్దేవా చేశారు. ఇది జరిగింది కేవలం అదానీకి సాయం చేయడానికే అంటూ ఖడ్గే వ్యాఖ్యానించారు. అమెరికా సుంకాలు, జరిమానా విధించడం, రష్యాతో వాణిజ్యంపై ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు బుధవారం స్పందించారు. పాక్‌భారత్ మధ్య కాల్పుల విరమణపై ట్రంప్ ప్రకటనలను ఖండిరచకుండా, పార్లమెంటులో మోదీ మౌనదీక్ష కొనసాగించారని విమర్శించారు. కలిసి చావమనండి అంటూ భాతర్
రష్యా ఆర్థిక వ్యవస్థలపై ట్రంప్ అక్కసు, 25 శాతం సుంకం ప్రకటించడం, రష్యాతో వాణిజ్యంపై జరిమానా విధించడంతో ఖడ్గే మండిపడ్డారు. భారత్‌పై ట్రంప్ నిరాధార ఆరోపణలు చేస్తుంటే మోదీ మౌనం పాటిస్తున్నారా? ఇది ఇంకెంతకాలం? అంటూ ప్రశ్నించారు. భారత్‌పై ట్రంప్ 25 సుంకంతో పాటు జరిమానా విధించడం దేశ వాణిజ్యానికి హానికరమని, దీంతో ఎంఎస్‌ఎంఈలు, రైతులపై తీవ్ర ప్రభావం ఉంటుందని, అనేక పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోతాయని ఖడ్గే ఆందోళన వ్యక్తంచేశారు. ‘అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నట్లు మీ మంత్రులు కొన్ని నెలలుగా చెబుతున్నారు. ఇందుకోసం కొందరు వాషింగ్టన్‌లో కొంతకాలం గడిపారు. ఇలాగేనే మీ మిత్రుడు వ్యవహరించేది. మీ దోస్తీకి ‘నమస్తే ట్రంప్’, ‘అబ్ కి బార్ ట్రంప్ సర్కార్’ కోసం దేశం మూల్యం చెల్లించుకుంటోంది’ అని ఖడ్గే మండిపడ్డారు. రష్యా నుంచి చమురు, ఆయుధాల కొనుగోలు, భారత్ బ్రిక్స్ సభ్యదేశంగా ఉండటం, డాలర్‌పై బ్రిక్స్ దాడి అంటూ భారత్‌పై ట్రంప్ ప్రతీకారం తీర్చుకుంటున్నారా అని ప్రశ్నించారు. తాజా పరిణామం భారతదేశ జాతీయ విధానం వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి దెబ్బతింటుందని ఖడ్గే హెచ్చరించారు. విదేశాంగ విధానానికి మూలం తటస్థ వైఖరి అని, ఇందుకు దేశ చరిత్రే సాక్షమని చెప్పారు. కేంద్రంలో ఏ పార్టీలో అధికారంలో ఉన్నాగానీ భారత ప్రయోజనాల దృష్ట్యా ప్రపంచ దేశాలతో స్నేహ సంబంధాల బలోపేతానికి కట్టుబడ్డాయని ఖడ్గే గుర్తుచేశారు. యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు అమెరికా సహా 45 దేశాలతో అణు ఒప్పందం జరిగిందని, అమెరికా తన చట్టాన్ని సైతం మార్చుకొని భారత్‌కు మద్దతు ఇచ్చిందని చెప్పారు. అణు ఇంధనం, సామగ్రిని కేవలం అమెరికా నుంచే తీసుకోవాలని అప్పట్లో ఆంక్షలు లేవని, ఇతర అవకాశాలు భారత్‌కు ఉన్నాయని ఖడ్గే గుర్తుచేశారు. ‘మీ (మోదీ) ప్రభుత్వంలో విదేశాంగ విధానం వల్ల జాతీయ విధానం దెబ్బతింటోంది. చమురు నిల్వలపై పాకిస్థాన్‌తో ఒప్పందం గురించి ట్రంప్ మాట్లాడుతున్నారు. భారత్‌ను బెదిరిస్తున్నారు. దీనిపై మీరు మౌనంగా ఉంటారా?’ అని ఖడ్గే ప్రశ్నించారు. అమెరికాచైనా
పాకిస్థాన్ మధ్య కొత్త బంధం తమను ఆందోళనకు గురిచేస్తోందని అన్నారు.