Site icon Desha Disha

మహిళలను రక్షించకుండా.. భక్షిస్తున్నారు..

మహిళలను రక్షించకుండా.. భక్షిస్తున్నారు..

సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ

బెంగళూరు : బిజెపి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళలను రక్షించాల్సింది పోయి.. భక్షించే పరిస్థికి వచ్చారు అని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ పేర్కొన్నారు. గురువారం బెంగళూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది ముమ్మాటికి ఘోరమైన సంఘటన. 400మందికి పైగా మహిళలను పొట్టనపెట్టుకున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలి అని కోరారు. ట్రస్ట్ బోర్డు సభ్యులను తక్షణ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ధర్మస్థల ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. శాఖధర్మస్థలంలో బలమైన ట్రస్టీ ఉండగా అక్కడ వారు చెప్పిన వారే పాలకులుగా ఉండాలి. అక్కడ ఎన్నికలు కూడా నామినేటెడ్ పద్ధతిలో ఎన్నుకుంటున్నారు. కాదని పోటీకి దిగిన సీపీఎం పార్టీ నేతను ఏం చేయలేక అతని కుమార్తైను 1980లో చంపేసినట్లు ఆధారాలు బయటపడ్డాయని, ఇంకా విచారణ సాగుతోందన్నారు. అప్పటి నుంచి ఇంత మహిళలు చనిపోతున్నా గుర్తించలేకపొవడానికి గత బిజెపి తప్పిదంగా చెప్పారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఓ మహిళ మీడియా ఎదుట వచ్చి చెప్పే వరకు విషయం బయటకు రాలేదని, అక్కడ మున్సిపాలిటీలో పనిచేస్తున్న స్కేవెంజర్ భయభ్రాంతులకు గురై విషయాన్ని బయటకు చెప్పినట్లు నారాయణ పేర్కొన్నారు. ఈ విషయంగా తీవ్రంగా భావించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆలయానికి సంబంధించి పదివేల కోట్లు డిపాజిట్లు, ఆస్తులు ఉన్నాయని ఏడాదికి 100 కోట్లపైగా ఆదాయం లభిస్తుందని అన్నారు. ఇంతటి ప్రసిద్ధి కలిగిన ఆలయాన్ని ప్రైవేటు ట్రస్టు బోర్డుకు వదిలివేయడం సమంజసమా అని ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ కర్ణాటక నేత శివరాజ్, ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి హరీష్ బాల పాల్గొన్నారు.

The post మహిళలను రక్షించకుండా.. భక్షిస్తున్నారు.. appeared first on Visalaandhra.

Exit mobile version