Site icon Desha Disha

మరోసారి భారీగా తగ్గిన బంగారం ధర..

మరోసారి భారీగా తగ్గిన బంగారం ధర..

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర బుధవారం స్వల్పంగా పెరిగిన సంగతి తెలిసిందే.
అయితే గురువారం నాడు మళ్లీ బంగారం ధరలో తగ్గుదల నమోదైంది.గురువారం ఉదయం నమోదైన గణాంకాల ప్రకారం, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.450 తగ్గగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 పడిపోయింది.ఇదే సమయంలో వెండి ధర కూడా తగ్గిన విషయం గమనార్హం. కిలో వెండిపై రూ.2,000 మేర తగ్గుదల కనిపించింది.అంతర్జాతీయంగా బంగారం ధర మాత్రం స్వల్పంగా పెరిగింది.
ఔన్సు గోల్డ్ పై మూడు డాలర్ల వరకూ పెరుగుదల ఉండటంతో, ప్రస్తుతం ఔన్సు బంగారం ధర 3,302 అమెరికన్ డాలర్ల వద్ద కొనసాగుతోంది.

భవిష్యత్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం
ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక పరిస్థితులు ఇంకా అనిశ్చితిలోనే ఉన్న నేపథ్యంలో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన 25 శాతం దిగుమతి సుంకాల ప్రభావం బంగారం మార్కెట్‌పైనా పడే అవకాశం ఉన్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.దీంతో భవిష్యత్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం తదితర ప్రాంతాల్లో ఈ రోజు బంగారం ధరలు తగ్గినట్లు తెలుస్తోంది.ఈ నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,700గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.1,00,030కు చేరుకుంది.
దేశంలోని ఇతర ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి:
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,850 కాగా, 24 క్యారెట్ల ధర రూ.1,00,180గా ఉంది.
ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,700, 24 క్యారెట్ల ధర రూ.1,00,030గా నమోదైంది.

వెండి ధరలు ఇలా… :
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఈ రోజు వెండి ధర తగ్గింది.ఈ నగరాల్లో కిలో వెండి ధర రూ.1,25,000 వద్ద ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,15,000గా నమోదైంది.చెన్నైలో కిలో వెండి ధర రూ.1,25,000 వద్ద కొనసాగుతోంది. గమనిక: పై ధరలు గురువారం ఉదయం మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవి మాత్రమే. గోల్డ్ మరియు సిల్వర్ ధరలు మార్కెట్ పరిస్థితులనుబట్టి నిరంతరం మారవచ్చు. ధరల విషయంలో నిర్ణయం తీసుకునే ముందు తాజా మార్కెట్ రేట్స్‌ను తెలుసుకోవడం మంచిది.

Exit mobile version