భయపెడుతున్నారు..కానీ నన్ను థియేటర్ కి రాకుండా ఆపలేరు

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్'(Kingdom Movie) నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే. కానీ విజయ్ దేవరకొండ గత చిత్రాలతో పోలిస్తే కచ్చితంగా మంచి సినిమానే అని, ఒకసారి చూడొచ్చని, బాక్స్ ఆఫీస్ పరంగా యావరేజ్ రేంజ్ వద్ద ఆగే పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. మరి అది ఎంత వరకు నిజం అనేది రేపటి కలెక్షన్స్ ని బట్టి తెలుస్తుంది. మొదటి రోజు ఓపెనింగ్ అయితే అదిరిపోయింది. మూవీ టీం ముఖం లో ఆనందం కనిపిస్తుంది. కాసేపటి క్రితమే మూవీ టీం మీడియా ముందుకొచ్చి ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి తమ ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ చాలా రిలీఫ్ ఫీల్ అయినట్టు ఆయన మాటల్లోనే తెలుస్తుంది.

Also Read: మాకు ఇప్పుడు విజయ్ దేవరకొండ నే పవన్ కళ్యాణ్ – నాగవంశీ

ఆయన మాట్లాడుతూ ‘చాలా కాలం తర్వాత నా స్నేహితులతో నిన్న రాత్రి కూర్చొని దావత్ వేశాను. చాలా సంతోషంగా అనిపించింది. ఈ సినిమాని గురువారం రోజున విడుదల చేస్తామని నిర్మాత నాగవంశీ చెప్తే, నాకెందుకు బాస్ ఇలాంటివి పెడుతారు, శుక్రవారం రిలీజ్ అంటేనే భయం వేస్తాది నాకు, నువ్వేమో గురువారం అంటున్నావ్ అని అన్నాను. అప్పుడు వంశీ ఏమి కాదు, నన్ను నమ్మండి, సినిమాలో కంటెంట్ ఉంది, జనాలు ఎగబడి వస్తారు అని చెప్పాడు. ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని నేను థియేటర్స్ లో అభిమానుల సమక్ష్యం లో చూడాలని అనుకుంటున్నాను. కానీ వీళ్లంతా నన్ను భయపెడుతున్నారు, కేసులు అవుతాయి అని. కానీ కచ్చితంగా ఎదో ఒకటి చేసి ఫ్యాన్స్ మధ్యలోనే ఈ సినిమాని చూస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. ఆయన గతం లో పుష్ప 2 ఘటన ని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేసాడని స్పష్టంగా అర్థం అవుతుంది.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు మొదటి రోజు ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం అయితే 35 నుండి 40 కోట్ల రూపాయిల మధ్యలో గ్రాస్ వసూళ్లు వస్తాయని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చాడు. సోమవారం రోజున సక్సెస్ మీట్ ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పాడు. అనేక ప్రాంతాల్లో ఈ సినిమాకు మొదటి రోజు 50 శాతం కి పైగా బ్రేక్ ఈవెన్ అయ్యింది. విజయ్ దేవరకొండ ని అందరు తెలంగాణ హీరో అని అంటుంటారని, కానీ ఈ చిత్రం రాయలసీమ లో మొదటి రోజు 50 శాతం కి పైగా బ్రేక్ ఈవెన్ అయ్యిందని చెప్పుకొచ్చాడు.

Leave a Comment