Kingdom Movie Criticism: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే చాలామంది టైర్ వన్ హీరోగా మారాలి అనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన కింగ్డమ్ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా కూడా ఒక జాతిని మేల్కొలిపివాళ్లను కాపాడే ఒక నాయకుడి సినిమాగా మన ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా అవతరిస్తాడు అని అందరూ అనుకున్నారు. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికి సినిమా అనుకున్న రేంజ్ లో లేదు అని కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజిఎఫ్ తరహాలోనే ఈ మూవీ ఉంది. సగటు ప్రేక్షకుడిని కొత్త లోకానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కానీ అది 100% వర్కౌట్ అవ్వలేదు… పులి ని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు కే జి ఎఫ్ ను చూసి కింగ్డమ్ సినిమా తీశారు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి కేజీఎఫ్ సెటప్ కి ఈ సెటప్ కి చాలా తేడా ఉంది. ఆ సినిమా వచ్చిన పిరియడ్ వేరు ఇప్పుడు ఈ సినిమా వచ్చిన టైమ్ వేరు… ఈ రెండింటి వల్ల విజయ్ దేవరకొండ అనుకున్న రేంజ్ లో ఈ సినిమా అవుట్ పుట్ అయితే రాలేకపోయింది.
Also Read: ‘హరి హర వీరమల్లు’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు..60 శాతం రీకవరీ!
మరి ఏది ఏమైనా కూడా కేజీఎఫ్ ని చూసి ఇంకెంతమంది వాళ్ళ సినిమాలను ఆ రేంజ్ లో తీయాలని అనుకుంటున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే మాస్ డైరెక్టర్గా మారాలనుకున్న గౌతమ్ తిన్న నూరి ఈ సినిమాతో కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికి ఫుల్ టైం మాస్ డైరెక్టర్ గా మాత్రం మారలేకపోయాడు.
మరి ఇకమీదటైనా కేజిఎఫ్ లాంటి సినిమాలు కాకుండా కొత్త తరహలో ముందుకు వెళుతూ మంచి సినిమాలను చేస్తే బాగుంటుందని సగటు ప్రేక్షకులందరు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… అయితే విజయ్ ఇలాంటి కథను కాకుండా ఒక డిఫరెంట్ కథను నమ్ముకొని ఉంటే బాగుండేది…
నిజానికి సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 సినిమా కూడా కేజీఎఫ్ తరహాలోనే తెరకెక్కింది. మరి ఆ సినిమా అనుకున్న దానికంటే భారీ రేంజ్ లో సక్సెస్ ని సాధించింది. వాళ్లు పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారం సినిమాని ప్రజెంట్ చేశారు. కాబట్టి ఆ సినిమాకు సక్సెస్ దక్కింది. మరి కింగ్డమ్ పరిస్థితి ఏంటి? ఈ సినిమా లాంగ్ రన్ లో హిట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరొక రెండు మూడు రోజులు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది…
Also Read: రాజాసాబ్ సెట్ లో ప్రభాస్ కు ఊపిరి అందించేందుకు మూవీ టీం ఏం చేసిందంటే!