'కింగ్డమ్' సెంటిమెంట్ సీన్స్ కి నవ్వుతున్నారు భయ్యా..ఇలా అయితే కష్టమే!

Kingdom Sentiment Scenes

Kingdom Sentiment Scenes: చాలా తక్కువ సమయం లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకోవడం అందరి హీరోల విషయం లో జరగదు. కొంతమంది ఏళ్ళ తరబడి నుండి సినిమాలు చేస్తున్నా కూడా ఇప్పటికీ తమకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. అలాంటి కాలం లో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) లాంటి హీరో కి మొదటి సినిమా నుండే ఆడియన్స్ నుండి మంచి ఆదరణ దక్కింది. పెళ్లి చూపులు పెద్ద హిట్ అయ్యింది, ఇక ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ ని షేక్ చేసి వదిలింది. ఇక గీత గోవిందం సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇలా కెరీర్ ప్రారంభం లోనే వరుసగా మూడు మెగా బ్లాక్ బస్టర్స్ ని అందుకొని యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. ఈ మూడు చిత్రాల తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నప్పటికీ, క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు.

Also Read: రిస్కీ స్టోరీ లైన్ తో రామ్ చరణ్,సుకుమార్ మూవీ..ఇలా అయితే కష్టమే!

ఇలా ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా, అది కూడా బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేని హీరో ఇంత కాలం కొనసాగుతూ వస్తున్నాడంటే, కచ్చితంగా అతనిలో ఎదో తెలియని ఆకర్షణీయమైన శక్తి ఉంది. కానీ విజయ్ దేవరకొండ కోటి మందిలో ఒకరికి దొరికే అదృష్టాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నాడని అనిపిస్తుంది. వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ ఇలా వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత విజయ్ దేవరకొండ నుండి విడుదలైన చిత్రం ‘కింగ్డమ్'(Kingdom Movie).నేడు భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ఫస్ట్ హాఫ్ వరకు మంచి టాక్ వచ్చింది కానీ, సెకండ్ హాఫ్ కి మాత్రం ఘోరమైన నెగిటివ్ టాక్ వచ్చింది. సెకండ్ హాఫ్ బాగా రాకపోవడానికి కారణం విజయ్ దేవరకొండ నే అని అంటున్నారు ఈ సినిమాని చూసిన నెటిజెన్స్. అన్నదమ్ముల మధ్య ఉండే ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు.

Also Read: కింగ్డమ్ పార్ట్ 2 లో మురుగన్ అన్న గా ఆ స్టార్ హీరో నటిస్తున్నాడా..?

కొన్ని సన్నివేశాల్లో విజయ్ దేవరకొండ ఎమోషనల్ యాక్టింగ్ ని చూసి థియేటర్స్ లో జనాలు నవ్వుతున్నారు అంటే అతిశయోక్తి కాదేమో. సినిమా సినిమాకు తనని తానూ మార్చుకునే వాడే నిజమైన నటుడు. ప్రతీ సినిమాకు ఒకే తరహా డైలాగ్ మాడ్యులేషన్, ఒకే తరహా యాక్టింగ్ చేస్తే జనాలు నిర్మొహమాటంగా షెడ్డుకి పంపేస్తారు. విజయ్ దేవరకొండ తనని తాను తదుపరి చిత్రం తో అయినా మార్చుకోకపోతే, కచ్చితంగా ఆయన షెడ్డుకి వెళ్లిపోవడం పక్కా అని విశ్లేషకులు సైతం అంటున్నారు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల్లో జనాలకు గొప్ప నటుడు ఏమి కనిపించలేదు. ప్రతీ సినిమాలోనూ ఒక రకమైన యాటిట్యూడ్ ని మెయిన్ చేయడం, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ని మైంటైన్ చేయడం వల్ల, అమ్మాయిల్లో ఆయనకు మంచి క్రేజ్ ఏర్పడింది, అంత వరకు మాత్రమే కానీ, మామూలు ఆడియన్స్ ని అలరించాలంటే మాత్రం యాక్టింగ్ మార్చాల్సిందే, ఇలాగే ఉంటే మనుగడ సాగించడం అసాధ్యం.

Leave a Comment